గజలక్ష్మి
గజలక్ష్మి (ఏనుగులతో ఉన్న లక్ష్మి) లక్ష్మీదేవి కి గల అష్ఠలక్ష్మి అంశాలలో ఒక రూపం. ఈ రూపంలో ఆమె కమలం మీద పద్మాసన భంగిమలో కూర్చొని ఉంటుంది. ఆమెకు నాలుగు చేతులు ఉంటాయి. ఆమెకు గల పై చేతులలో కమలాలను పట్టుకొని ఉంటుంది. కింది చేతులలో ఒకటి అభయహస్తం కాగా రెండవది వరద ముద్ర తో ఉంటుంది. ఆమెకు చుట్టూ ఉన్న ఏనుగులు వాటి తొండాలతో జలాలను ఆమెపై పోసి సంప్రోక్షణ చేస్తున్నట్లుంటాయి. లక్ష్మి కి గల ఇతర అంశముల మాదిరిగానే ఈ అంశ లోని రూపం శ్రేయస్సు, అదృష్టం, సమృద్ధికి ప్రతినిధి గా ఉంటుంది. హిందూ, బౌద్ధ విగ్రహాలలో గజలక్ష్మి మూలాంశాలు చాలా సాధారణం.
గజలక్ష్మి చిత్రం, బహుశా బౌద్ధ గ్రంథాల ప్రకారం, సా.పూ 2 వ శతాబ్దం నుండి గుర్తించవచ్చు. [1] బౌద్ధ సైట్ బ్రర్‌హట్ లో సా.పూ 125-100 కాలంలో రెయిలింగ్లపై కనిపిస్తుంది. ఇది సా.పూ 1వ శతాబ్దంలో అజిలిసెస్ రాజ్యంలోని నాణేలపై కనిపిస్తుంది. సా.శ 3వ శతాబ్దంలో కౌసంబి నగరంలోని నాణేలపై కూడా ఈ చిత్రం కనిపించింది. ఒక మహిళతో పాటు చిత్రీకరించబడిన ఒకటి లేదా రెండు ఏనుగులు గౌతమ బుద్ధుని పుట్టుకను సూచిస్తాయి.
సాంప్రదాయకంగా స్థానికంగా ఉన్న కళింగ నిర్మాణ శాస్త్రంలో నిర్మించబడిన ఒడిషాలోణి దేవాలయాలలో గజలక్ష్మి చిత్రాలు లలితాసనంలో ఆశీనురాలైనట్లు ఉంటాయి. దానిని లలితాంబిక గా పిలుస్తారు.అది తలుపులమీద మధ్యలో ఉంటుంది.
కంబోడియాలోని సీమ్ రీప్‌లోని బాంటే శ్రీ ఆలయంలోని టింపనంపై పింక్ సాండ్‌స్టోన్‌లో గజలక్ష్మిజి విగ్రహం అందంగా చెక్కిన చిత్రం ఉంది. వెయ్యి సంవత్సరాలకు పైగా ఉన్నప్పటికీ, ఈ టింపనం సృష్టించబడినప్పుడు ఎలా ఉందో అలానే మంచి స్థితిలో ఉంది.
గోవా, కొంకణ్ ప్రాంతాలలో ప్రజలు గజలక్ష్మిని తమ సంరక్షక దేవతగా పూజిస్తారు. ఈ దేవతను గజంత్ లక్ష్మి, గలలక్ష్మి, కెల్బాయి లేదా భౌక దేవి గా కొంకణ ప్రజలు పిలుస్తారు. [2]
తిమోతి టేలర్ ప్రకారం, గుండెస్ట్రప్ కౌల్డ్రాన్ (సా.పూ 200 నుండి సా.శ 300 మధ్య తయారుచేసినై వెండి పాత్రలు) పై ఉన్న ఏనుగులతో కూడిన స్త్రీ దేవతకు, గజలక్ష్మికి సంబంధం ఉండవచ్చు.
-
గజలక్ష్మి పతకం, భర్హట్ స్థూపం రైలింగ్ స్థూపాన్ని, ఇసుకరాయి, 125-100 BCE, ఇండియన్ మ్యూజియం, కోలకతా
-
1 వ శతాబ్దం BCE
-
ఒడిశాలోని రత్నగిరి వద్ద ఉన్న బౌద్ధ మఠం 1 యొక్క ద్వారం మీద
-
ఒడిశా, 18 వ శతాబ్దం
-
రాజా రవివర్మ, దేవత లక్ష్మి, 1896
అనులేఖనాలు
[మార్చు]- ↑ Coomaraswamy, Ananda, Elements of Buddhist Iconography, Harvard University Press, p. 22, 1935, online text
- ↑ "Gajalaxhmi: The goddess of Rain". No. Buzz. Navhind times. August 7, 2014. Retrieved 30 May 2016.
మూలాలు
[మార్చు]- డిక్షనరీ ఆఫ్ హిందూ లోర్ అండ్ లెజెండ్ ( ) అన్నా డల్లాపికోలా చేత