Jump to content

గడ్డివాము

వికీపీడియా నుండి
ఎండు పశుగ్రాసం కొరకు వేసిన వరి గడ్డివాము
విశాఖ జిల్లా, రాజుల తాళ్ళవలస వద్ద గడ్డివాము

వరి పైరు కోసి దానిని కంకుల గుండు లేదా ట్రాక్టర్తో నూర్చి దాని నుండి గింజలను తీసివేసి మిగిలిన గడ్డిని ఒక కుప్పగా వేస్తారు. దానినే గడ్డి వామి అంటారు. సాధారణంగా వరిగడ్డిని రాతి కూసాలపైన పందిరి వేసి దానిపైన వామి వేస్తారు. గడ్డితీయడానికి, దానికి నిచ్చెన వేసి ఎక్కి గడ్డిని తీసి పశువులకు వేస్తారు. ఉత్తరాంధ్రలో నేలపైనే గడ్డి వామును ఉంచుతారు.
వరిగడ్డిని పశువులకు దాణాగా ఉపయోగిస్తారు. సంవత్సరమంతా రైతులు వారి పశువుల మేతను భద్రపరచుకొనుటకు గడ్డిని కుప్పగా వేసి ఉంచుతారు. ఈ గడ్డి వాములోని గడ్డిని కొద్దికొద్దిగా తీసి పశువులకు మేతగా ఉపయోగిస్తారు.

అప్పుడే కోసిన గడ్డితో వాము

అగ్నిమాపకశాఖ వారి సూచనలు

[మార్చు]

1. పూర్తిగా ఎండిన గడ్డిని మాత్రమే వాములుగా వేయండి.

2. గడ్డివాముల నుండి నివాస గృహములను తప్పనిసరిగా 60 అడుగుల దూరమును పాటించండి.

3. గడ్డివాములను గాలివాటంగా రైట్ యాంగిల్స్ లో నిర్మించండి.

సామెతలు

[మార్చు]

గడ్డివాము వద్ద కుక్క కాపల - గడ్డివాము కాడి కుక్క తను తినదు ఇతరులను తిననివ్వదు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

అగ్ని భద్రత

బయటి లింకులు

[మార్చు]