గతం( 2020 సినిమా)
గతం | |
---|---|
దర్శకత్వం | కిరణ్ కొండమడుగుల |
స్క్రీన్ ప్లే | కిరణ్ కొండమడుగుల |
కథ | కిరణ్ కొండమడుగుల |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | మనోజ్ రెడ్డి |
కూర్పు | జి.ఎస్ |
సంగీతం | శ్రీ చరణ్ పాకాల |
నిర్మాణ సంస్థలు | ఆఫ్ బీట్ ఫిలింస్ ఎస్ ఒరిజినల్స్ |
పంపిణీదార్లు | అమెజాన్ ప్రైమ్ |
విడుదల తేదీ | 6 నవంబరు 2020 |
సినిమా నిడివి | 102 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | $155,000 |
'గతం' 2020లో తెలుగులో వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా. ఈ చిత్రానికి కిరణ్ కొండమడుగుల దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో భార్గవ పోలుదాసు, రాకేశ్ గలేభె, పూజిత కురపర్తి ముఖ్యపాత్రల్లో నటించారు. కోవిడ్ నేపథ్యంలో థియేటర్స్ మూతపడటంతో 6 నవంబర్ 2020న ఓటిటిలో అమెజాన్ ప్రైమ్‌లో విడులైంది. ఈ చిత్రాన్ని 51వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో(IFFI) లోని ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శించే 23 భారతీయ చిత్రాల జాబితాలో తెలుగు నుండి ఎంపికైన ఏకైక సినిమాగా 'గతం' నిలిచింది.[1]
కథ
[మార్చు]అమెరికాలోని ఓ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరుగుతాయి. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న రిషి(రాకేశ్) మంచం మీద కోమాలో నుంచి లేచి, గతం మర్చిపోయిన ఓ అబ్బాయి ప్రియురాలిగా గతాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నించే అదితి (పూజిత). గతాన్ని తెలుసుకోవడానికంటూ వారిద్దరూ కారులో బయలుదేరతారు. మార్గమధ్యంలో, చిమ్మచీకటిలో కారు బ్రేక్‌డౌన్ అయి ఆగిపోతే, అపరిచిత వ్యక్తి అర్జున్ (భార్గవ పోలుదాసు) తన ఇంట్లో ఆశ్రయం ఇస్తాడు. ఆ ఇంట్లోకి వెళ్ళాక ఆ జంటకు ఎదురైన విచిత్రమైన అనుభవాలు ఏమిటి, మర్చిపోయిన ఆ గతం ఏమిటి, ఆ గతానికీ ఈ వ్యక్తులకూ సంబంధం ఏమిటన్నది కథ. [2][3]
నటీనటులు \ సినిమాలో పాత్ర పేరు
[మార్చు]- భార్గవ పోలుదాసు - అర్జున్
- రాకేశ్ గలేభె - రిషి
- పూజిత కురపర్తి - మీరా
- తిరుముడి తులసిరామన్ -రమేష్
- హర్ష ప్రతాప్ - హర్ష
- ఉప్పులూరి - డా.శ్రీకాంత్
- సోప్ పుచ్లే - సారా పీటర్స్
- రఘు గోపాల్ - లక్ష్మణ్
- ప్రసాద్ రాణి - డా. విశ్వ
మూలాలు
[మార్చు]- ↑ "Acclaimed Telugu film "Gatham" bags Panorama award: To be screened at IFFI - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-12-23.
- ↑ ఆంధ్రజ్యోతి (7 November 2020). "'గతం' మూవీ రివ్యూ". Archived from the original on 26 జనవరి 2021. Retrieved 14 April 2021.
- ↑ సాక్షి, హోం సినిమా (7 November 2020). "'గతం'... గుర్తు పెట్టుకోలేం! అలాగని మరిచిపోలేం!". Sakshi. Archived from the original on 7 నవంబరు 2020. Retrieved 14 April 2021.