గదబ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గదబ భాష మాట్లాడే గదబ జాతి స్త్రీ

గదబ అన్నది మధ్య ద్రవిడ భాషా కుటుంబానికి చెందిన భాష. ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలోనూ, ఒఢిశా లోని కోరాపుట్ జిల్లా ప్రాంతంలోనూ నివసించే గదబ తెగ వారు మాట్లాడే భాష. ఇందులో ఒల్లరి గదబ, కొండెకొర్ గడబ అని రెండు రకాలు ఉన్నవి. భాషావేత్తలు ప్రస్తుతం ఈ రెంటినీ రెండు వేర్వేరు భాషలుగా గుర్తిస్తున్నారు. 2002 గణాంకాల ప్రకారం ఒల్లరి ని మాతృభాషగా మాట్లాడేవారు 15000 మందీ,[1] కొండెకొర్ ని మాతృభాషగా మాట్లాడేవారు 8000 మందీ ఉన్నారు.[2] గదబ పేరు గల మరొక భాష బోడొ గదబ - ఇది ఆస్ట్రో-ఏసియాటిక్ భాషా కుటుంబంలోని ముండ ఉప కుటుంబానికి చెందిన భాష. ఇది ఒల్లరి-కొండెకొర్ భాషల వర్గానికి చెందు.

ఒల్లరి గదబ ప్రధానంగా ఒఢిశాలోని కోరాపుట్ జిల్లాలో గల నందాపూర్, పొట్టంగి ప్రాంతాలలో మాట్లాడతారు. ప్రపంచ భాషలని కేటలాగ్ చేసే ఎథ్నోలాగ్ వెబ్సైటు ప్రకారం ఈ భాష దైనందిన సంభాషణల్లో అన్ని తరాల వారూ వాడుతున్న భాష. ఈ భాషకు సొంత లిపి లేదు. తెలుగు ఎక్కువగా మాట్లాడే ప్రాంతాలలో తెలుగు లిపిని, ఒఢియా మాట్లాడే ప్రాంతాలలో ఆ లిపినీ వాడతారు.

కొండెకొర్ గదబ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలోని సాలూరి, పాచిపెంట మండలాల్లోనూ, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలోనూ మాట్లాడతారు. ఎథ్నోలాగ్ వారి వెబ్సైటు ప్రకారం ఈ భాష తరుచుగా వాడబడుతున్న భాష. కొంత సాహిత్యం కూడా లభ్యమవుతున్న భాష. ఈ భాషకి సొంత లిపి లేదు. తెలుగు లిపిని వాడతారు.

మూలాలు[మార్చు]

  1. "Gadaba, Pottangi Ollar".
  2. "Gadaba,Mudhili".
"https://te.wikipedia.org/w/index.php?title=గదబ&oldid=3831128" నుండి వెలికితీశారు