గమకం
స్వరూపం
సప్తస్వరాలలో ఏ స్వరమైనా, తన స్థానాన్ని వదలక తనకు ముందు వెనుక ఉన్న స్వరస్థానాలతో మైత్రి చేసి కలిసి నడవడాన్ని గమకం అంటారు. దీక్షితార్ కీర్తనలలో గమకాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.
రకాలు
[మార్చు]చతుర్దండి ప్రకారం మొత్తం పదిహేను రకాల గమకాలు ఉన్నాయి. వీటి వివరాలు సుబ్బరామ దీక్షితులవారు రచించిన'సంగీత సంప్రదాయ ప్రదర్శిని'లో లభిస్తున్నాయి:[1]
తిరుప: స్ఫురితశ్చైవ కంపితో లీన ఇత్యపి
ఆందోలితో వలిశ్చాథ త్రిభిన్న: కురుళీహతౌ
ఉల్లాసిత: ప్లావితశ్చ హుంపితో ముద్రితస్తథా
నామితో మిశ్రితశ్చేతి భేదా: పంచదశ స్మృతా:
- 1. తిరుపము
- 2. స్ఫురితము
- 3. కంపితము
- 4. లీనము
- 5. ఆందోలితము
- 6. వలి
- 7. త్రిభిన్నము
- 8. కురుళీ
- 9. ఆహతము
- 10. ఉల్లాసితము
- 11. ప్లావితము
- 12. హుంపితము
- 13. ముద్రితము
- 14. నామితము
- 15. మిశ్రితము
ఇతరుల భావన ఇలా ఉన్నది:
మొత్తం పది రకాల గమకాలు:
- 1. ఆరోహణ,
- 2. అవరోహణ,
- 3. ఢాలు
- 4. కంపితం
- 5. స్ఫురితం
- 6. ఆహతం
- 7. ప్రత్యాహతం
- 8. ఆందోళితం
- 9. త్రిపుచ్ఛం
- 10. మూర్ఛన
మూలాలు
[మార్చు]- ↑ దీక్షితులు, సుబ్బరామ. నోరి, ఆచార్య నాగభూషణం (ed.). సంగీత సంప్రదాయ ప్రదర్శిని. హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ.