గర్భనిరోధ మాత్రలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గర్భనిరోధక మాత్రలు (ఆంగ్లం: Contraceptive pills) ముఖ్యంగా హార్మోన్ లకు సంబంధించినవిగా ఉంటాయి. ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌.. వంటి ప్రత్యుత్పత్తి హార్మోన్లు కలగలిసిన ఈ మాత్రలు గర్భం ధరించకుండా అడ్డుకుంటాయి.[1]

కుంకుడుతో గర్భనిరోధక లేపనం

[మార్చు]

కుంకుడు కాయ శిరోజాలను కాపాడటమే కాదు గర్భనిరోధక సాధకంగానూ ఉపయోగపడుతుందని తేలింది. లక్నోలోని కేంద్ర ఔషధ పరిశోధన సంస్థ (సీడీఆర్ఐ) శాస్త్రవేత్తలు కుంకుడు కాయ నుంచి గర్భనిరోధక లేపనం తయారుచేశారు. దీనికి 'కాన్‌సాప్' అనే పేరు పెట్టారు. ఈ పూతను యోని లోపలి భాగంలో పూసుకుంటే గర్భనిరోధక సాధనంగా పనిచేస్తుంది. అంతేకాదు... యోని లోపలి భాగంలోని చెడు బ్యాక్టీరియా, ఇతర ఇన్‌ఫెక్షన్‌లను కూడా తొలగిస్తుంది. మంచి బ్యా క్టీరియాను మాత్రం కాపాడుతుంది. "నోటి ద్వారా వేసుకునే గర్భ నిరోధక మాత్రల్లాగా దీనిని నెల లో రోజుల తరబడి వాడాల్సిన అవసరం లేదు. స్టెరాయిడ్‌ గర్భనిరోధక మాత్రలతో రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు. కుంకుడు కాయ క్రీమ్‌తో ఈ బెడదలేవీ ఉండవు. ఇది సురక్షితమైనది. పైగా దీనిని నోటిద్వారా తీసుకోవాల్సిన అవసరం లేదు. అవసరమైనప్పుడు మాత్రం యోని లోపల రాసుకుంటే చాలు. కాన్‌సాప్‌పై అన్నిరకాల పరీక్షలు పూర్తయ్యాయని, స్థానిక మార్కెట్‌లో దీనిని విక్రయించేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతించింది. కాన్‌సాప్ తయారీ లైసెన్సును హిందూస్థాన్ లేటెక్స్ లిమిటెడ్ (హెచ్ఎల్ఎల్) కు ఇచ్చారు. (ఆంధ్రజ్యోతి6.10.2009)

పనిచేసే విధానాలు

[మార్చు]
  • అండాశయం నుండి అండాన్ని విడుదల కాకుండా ఆపెయ్య వచ్చును.
  • అండంతో వీర్యకణం ఫలవంతం కాకుండా ప్రతిబంధించవచ్చు.
  • అండం ఫలవంతం అయిన తర్వాత దాన్ని గర్బాశయం లోపలిపొరల మీద అతుక్కోనివ్వకుండా అడ్డగించ వచ్చును.

పురుషులకు వీర్య నిరోధక ఇంజెక్షన్

[మార్చు]

స్త్రీలకు గర్భనిరోధక మాత్రలాగా పురుషుల్లో వీర్యనిరోధక ఇంజెక్షన్‌ రానుంది. ఈ ఇంజెక్షన్‌ స్త్రీలు వాడే గర్భనిరోధక మాత్రల్లాగే పనిచేస్తుంది‌. పురుషుల్లో ఈ ఇంజెక్షన్‌ ద్వారా వీర్య ఉత్పత్తిని తాత్కాలికంగా నిరోధించ వచ్చు అంతమాత్రం చేత వారిలో వీర్యవృద్ధి ఇక జరగదేమో అనే భయం అవసరం లేదు. తాత్కాలికంగా మాత్రమే ఈ ఇంజెక్షన్‌ ప్రభావం ఉంటుంది. ఒకసారి ఇంజెక్షన్‌ వాడకాన్ని ఆపేస్తే తిరిగి యథావిధిగా వీర్యవృద్ధి జరుగుతుంది.(ఈనాడు 16.2.2010)

మూలాలు

[మార్చు]
  1. "గర్భనిరోధక మాత్రలు వేసుకుంటే ఇక ఎప్పటికీ పిల్లలు పుట్టరా?". EENADU. Retrieved 2022-01-29.