Jump to content

గాధిరాజు సత్యనారాయణ రాజు

వికీపీడియా నుండి

గాధిరాజు సత్యనారాయణరాజు మహబూబ్ నగర్ జిల్లా, బండమీదిపల్లికి చెందిన హనుమభక్తుడు, రచయిత. ఇతను పలు కీర్తన గ్రంథాలను, శతకాలను రచించాడు.[1]

రచనలు

[మార్చు]

బాల భజనమాల, హనుమత్ప్రసన్న భజనమాల, హనుమచ్చాలిసా దండకమాల, ప్రసన్న భజనమాల, హనుమత్పూజా సుప్రభాతం చాలీసా ప్రసన్న భజనమాల, హనుమపూజా చాలీన దాసకృతులు, మన్నెంకొండ భజనపాటలు, హనుమదర్శనం - అద్భుతలీల పూజా - భజన గీతాలు, దైవదర్శననుతి రత్నమాల" అనే కీర్తనల సంపుటాలను రచించాడు.[1]

శతకం

[మార్చు]

ఇతను హనుమత్ శతకాన్ని రచించి 2004లో ప్రచురించాడు. "విశ్వ విజయ అభయ వీరహనుమ" అనే మకుటంతో ఈ శతకాన్ని రచించాడు. ఈ శతకంలో దేవతాస్తుతి, గురువాజ్ఞ, అభయలబ్ధి, హనుమ రామభక్తి శిక్షరక్ష మహిమ, స్వామి సన్నిధి, మంత్రమహిమ, పరమాత్మ జ్ఞాని, అర్చన అర్హత, ఆలయాలు, అష్టాక్షరీ మంత్ర సంధానకృతులు వంటి అంశాల పై శతక పద్యాలు రచించాడు.[1]

ఉదాహరణ పద్యం

[మార్చు]

అడగకుండ నిచ్చునతడు పరమాత్ముడు
అడిగినంతనిచ్చునతదు జ్ఞాని
అడుగనదుగ నియడు అతిలోభినీచుడే
విశ్వ విజయ అభయ వీర హనుమ!

వంటి నిత్య సూక్తులు ఈ శతకంలో రచించాడు. ఈయన 'విశ్వరూప దర్శనం - ప్రేమ యోగం' అనే పద్య సంపుటిని వెలువరించాడు. గీతలోని 11, 12వ అధ్యాయాలలోని శ్లోకాలను 'ప్రేమ యోగం' పేరుతో పద్యాలను రచించాడు.[1]

బాల విద్యా విజ్ఞాన లహరి

[మార్చు]

బాలబాలికల కోసం ప్రత్యేకంగా బాల విద్యా విజ్ఞాన లహరి అనే గ్రంథాన్ని రచించాడు. ఇందులో ఆత్మవందనం, జన్మభూమి ప్రత్యక్ష దేవతాస్వరూపములు, సూర్యవందనం, సమాజ వందనం, కామధేనువు, కారుచీకట్లో, కాంతిపుంజాలు, నిండుదనం వంటి వాటి గూర్చి పిల్లలకు అర్థమయ్యేరీతిలో వ్యాసాలను రచించాడు.

ఆధ్యాత్మిక వికాసం, అభయ వీర హనుమాన్ అద్భుత చరిత్ర, హనుమదుత్సవ మహిమక్షేత్రం అనేవి ఇతని రచించిన ఇతర గ్రంథాలు.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 మహబూబ్ నగర్ జిల్లా సాహిత్య చరిత్ర, డా. భీం పల్లి శ్రీకాంత్. తెలంగాణ సాహిత్య అకాడమీ.