Jump to content

గాబ్రియెల్లా చార్ల్టన్

వికీపీడియా నుండి
గాబ్రియెల్లా చార్ల్టన్
జననం
గాబ్రియెల్లా నటాలీ చార్ల్టన్

(1998-12-18) 1998 డిసెంబరు 18 (వయసు 26)
జాతీయతభారతీయురాలు
ఇతర పేర్లుగాబి
విద్యలయోలా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, చెన్నై
వృత్తి
  • నటి
  • నర్తకి
క్రియాశీల సంవత్సరాలు2009–ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
  • జోడి నెం.1 (టీవీ సిరీస్)
  • బిగ్ బాస్ (తమిళ సీజన్ 4)
ఈరమన రోజావే (టీవీ సిరీస్)

గాబ్రియెల్లా నటాలీ చార్ల్టన్ (ఆంగ్లం: Gabriella Charlton; జననం 1998 డిసెంబరు 18) భారతీయ నటి.[1] గాబ్రియెల్లాగా ప్రసిద్ధి చెందిన ఆమె తమిళ భాషా టెలివిజన్, చలనచిత్రాలలో పని చేస్తుంది. ఆమె రియాలిటీ డ్యాన్స్ టెలివిజన్ సిరీస్ జోడి జూనియర్‌లో పాల్గొన్నది. అలాగే, జోడి నంబర్ వన్ ఆరవ సీజన్‌లోనూ ఉన్న ఆమె విజయం సాధించింది. 2020లో, ఆమె బిగ్ బాస్ తమిళ రియాలిటీ సిరీస్ నాల్గవ సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఉంది.

కెరీర్

[మార్చు]

గాబ్రియెల్లా తన తొమ్మిదేళ్ల వయసులో స్టార్ విజయ్‌లో ప్రసారమయ్యే డ్యాన్స్ రియాలిటీ షో జోడి జూనియర్‌లో ప్రవేశించడం ద్వారా టెలివిజన్‌ రంగంలో తన వృత్తిని ప్రారంభించింది.[2] ఆమె స్టార్ విజయ్‌లో ప్రసారమైన 7సి అనే తమిళ సోప్ ఒపెరాలో చేసింది. స్టార్ విజయ్ రియాలిటీ డ్యాన్స్ సిరీస్ జోడి నంబర్ వన్ ఆరవ సీజన్‌లో కూడా పాల్గొన్న ఆమె గెలిచింది.[3]

ఆమె రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం 3లో సుమీగా[4], ఆ తర్వాత చెన్నైయిల్ ఒరు నాల్‌లో రియాగా నటించింది.[5] ఆమె తమిళ బిగ్ బాస్ సీజన్ 4లో ఫైనలిస్ట్. అలాగే, ఆమె ఈరమన రోజావే 2లో ప్రధాన పాత్ర పోషించింది.

మూలాలు

[మార్చు]
  1. What I Did On My Birthday | Mom Surprised Me | Gabriella Charlton (in ఇంగ్లీష్), retrieved 2023-12-22
  2. "From Neelima Rani to Sujitha Dhanush: Tamil actresses who started their career as child artists". The Times of India. 31 Aug 2023. Retrieved 27 Nov 2023.
  3. Lakshmi, K.; Hamid, Zubeda (30 March 2014). "Reality shows change lives". The Hindu. Archived from the original on 31 March 2014.
  4. "தனுஷின் 3 படத்தில் கேப்ரியெல்லா நடிக்க இப்படி தான் வாய்ப்பு கிடைத்ததா?". Tamil Cinema News (in ఇంగ్లీష్). Retrieved 2023-12-22.
  5. Kumayaa, Harshitha D. (12 May 2016). "Gabriella's going places". The Hindu.