Jump to content

గిట్హబ్ కోపైలట్

వికీపీడియా నుండి
గిట్హబ్ కోపైలట్
అభివృద్ధిచేసినవారు గిట్హబ్, ఓపెన్‌ఏఐ
మొదటి విడుదల అక్టోబరు 2021; 3 సంవత్సరాల క్రితం (2021-10)
సరికొత్త విడుదల 1.7.4421
నిర్వహణ వ్యవస్థ మైక్రోసాఫ్ట్ విండోస్, లినక్స్, మ్యాక్‌ఓఎస్, వెబ్
వెబ్‌సైట్ copilot.github.com

గిట్హబ్ కోపైలట్ ఒక కోడ్ పూర్తిచేసే (ఆటోమేటిక్) పనిముట్టు. దీనిని గిట్హబ్, ఓపెన్‌ఏఐ‌ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసాయి. ఇది విజ్యువల్ స్టూడియో కోడ్, విజ్యువల్ స్టూడియో, నియోవిం, జెట్‌బ్రెయిన్స్ వంటి ఐడీఈల (ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్వైరన్మెంట్) వాడుకర్లకు కోడ్ ఆటోపూర్తి చేస్తూ సహాయం చేస్తుంది.[1] ప్రస్తుతం ఇది ఒక రుసుము చెల్లించిన వ్యక్తిగత డెవలపర్లకూ, వ్యాపారాలకూ వేరు వేరు వెలల్లో అందుబాటులో ఉంది. దీనిని మొట్టమొదట 2021 జూన్ 29న గిట్హబ్ సంస్థ ప్రకటించింది. ఇది పైథన్, జావాస్క్రిప్ట్, టైప్‌స్క్రిప్ట్, రూబీ, ఇంకా గో ప్రోగ్రామింగ్ భాషల్లో కోడ్ చేసే వారికి అత్యంత చక్కగా పనిచేస్తుంది.[2] 2023 మార్చిలో, గిట్హబ్ సంస్థ "కోపైలట్ ఎక్స్" అనే ప్రాజెక్టు కోసం ప్లాన్లు విడుదల చేసింది. ఇందులో భాగంగా కోపైలట్‌లో ఒక జీపీటీ-4 ఆధారంగా‌ పనిచేసే చాట్‌బాట్ (ముచ్చట్ల బాట్) తోపాటు నోటితో ఆజ్ఞలు (వాయిస్ కమ్యాండ్స్) కు సపోర్ట్‌ను పొందుపరుస్తారు.[3]

ఫీచర్లు

[మార్చు]

ఒక ప్రోగ్రామింగ్ సమస్యను మానవ భాషలో కోపైలట్ ముందుంచినప్పుడు, ఈ పనిముట్టు ఆ సమస్యకు పరిష్కారమైన కోడ్‌ను జెనరేట్ (తయారు) చేయగలిగే సామర్థ్యం కలిగి ఉంది.[4] ఇది ఒక కోడ్‌ను చూపిస్తే, దానికి అర్థం ఇంగ్లీషు భాషలో వివరించడం, ఇంకా ఒక ప్రోగ్రామింగ్ భాష నుంచి ఇంకొకదానికి కోడ్‌ను అనువాదం చేయడం వంటి సామర్థ్యాలను కలిగి ఉంది.[4]

వారి వెబ్‌సైట్ ప్రకారం, గిట్హబ్ కోపైలట్‌లో కోడ్‌ కామెంట్లను నడవగలిగే కోడ్‌గా మార్చగలగడం, ఇంకా కోడ్ చంక్స్‌నూ (ముక్కలు), రిపీట్ అయ్యే కోడ్ భాగాలనూ, ఇంకా పూర్తి మెథడ్లు లేదా ఫంక్షన్లనూ ఆటోపూర్తి చేయగలగడం వంటి సహాయక ఫీచర్లు ఉన్నాయి.[2][5] గిట్హబ్ నివేదికల ప్రకారం కోపైలట్‌లోని ఆటోపూర్తి ఫీచర్ దగ్గరదగ్గర‌ సగం సార్లు ఖచ్చితత్వంతో పనిచేస్తుంది.‌ ఉదాహరణకు, కోపైలట్‌ను కొన్ని పైథన్ ఫంక్షన్ హెడర్ కోడ్‌ల కొఱకు ఉపయోగించినప్పుడు, అది మిగిలిఉన్న 43% ఫంక్షన్ బాడీ కోడ్‌ను మొదటి ప్రయత్నంలోనూ, 57% ని పది ప్రయత్నాల తర్వాతా సరిగ్గా ఆటోపూర్తి చేసింది.[2]

గిట్హబ్ చెప్పేదాని ప్రకారం కోపైలట్ ఫీచర్లు ప్రోగ్రామర్లకు తమకు పరిచయం లేని ఫ్రేంవర్క్‌లను తెలుసుకోవడంలో, వాటి డాక్యుమెంటేషన్‌ను చదివే టైంను తగ్గించడం ద్వారా సహాయపడతాయి.[2]

ఇంకా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. గెర్ష్‌గార్న్, డేవ్ (29 జూన్ 2021). "GitHub and OpenAI launch a new AI tool that generates its own code". ద వర్జ్ (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 6 జూలై 2021.
  2. 2.0 2.1 2.2 2.3 "GitHub Copilot · Your AI pair programmer". గిట్హబ్ కోపైలట్ (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 7 ఏప్రిల్ 2022.
  3. "GitHub Copilot gets a new ChatGPT-like assistant to help developers write and fix code". ద వర్జ్. 22 మార్చి 2023. Retrieved 5 సెప్టెంబరు 2023.
  4. 4.0 4.1 ఫిన్నీ-ఆన్స్‌లీ, జేమ్స్; డెన్నీ, పాల్; బెకర్, బ్రెట్ A.; లుక్స్‌టన్-రైలీ, Andrew; ప్ర్యాథర్, జేమ్స్ (14 ఫిబ్రవరి 2022). "The Robots Are Coming: Exploring the Implications of OpenAI Codex on Introductory Programming". Australasian Computing Education Conference. ACE '22 (in అమెరికన్ ఇంగ్లీష్). న్యూయార్క్ నగరం, అమెరికా సంయుక్త రాష్ట్రాలు: అసోసియేషన్ ఫర్ కంప్యూటింగ్ మెషీనరీ. pp. 10–19. doi:10.1145/3511861.3511863. ISBN 978-1-4503-9643-1. S2CID 246681316.
  5. సొబానియా, డామినిక్; ష్వైం, డిర్క్; రాథ్‌లౌఫ్, ఫ్ర్యాన్జ్ (2022). "A Comprehensive Survey on Program Synthesis with Evolutionary Algorithms". IEEE Transactions on Evolutionary Computation. 27: 82–97. doi:10.1109/TEVC.2022.3162324. ISSN 1941-0026. S2CID 247721793.