గిరీష్ బాపట్
గిరీష్ బాపట్ | |||
| |||
లోక్‌సభ సభ్యుడు
| |||
పదవీ కాలం 23 మే 2019 – 29 మార్చి 2023 | |||
ముందు | అనిల్ శిరోలే | ||
---|---|---|---|
నియోజకవర్గం | పూణే | ||
ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల రక్షణ
| |||
పదవీ కాలం 4 డిసెంబర్ 2014 – 4 జూన్ 2019 | |||
తరువాత | శంభాజీ పాటిల్ నీలాంగేకర్ | ||
పార్లమెంటరీ వ్యవహారాల
| |||
పదవీ కాలం 4 డిసెంబర్ 2014 – 4 జూన్ 2019 | |||
ముందు | ప్రకాష్ మెహతా | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1995 – 23 మే 2019 | |||
ముందు | వసంత్ థోరాట్ | ||
తరువాత | ముక్తా తిలక్ | ||
నియోజకవర్గం | కస్బాపేట్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | తలెగాన్, మహారాష్ట్ర, భారతదేశం | 1950 సెప్టెంబరు 3||
మరణం | 2023 మార్చి 29 పూణే, మహారాష్ట్ర, భారతదేశం | (వయసు 72)||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | గిరిజ బాపట్ | ||
సంతానం | 1 కుమారుడు | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
మూలం | [1] |
గిరీష్ బాపట్ (3 సెప్టెంబర్ 1950 - 29 మార్చి 2023) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు కస్బాపేట్ నుండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఫడ్నవీస్ మంత్రివర్గంలో ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల రక్షణ, ఆహారం, ఔషధాల నిర్వహణ, పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ మంత్రిగా పని చేసి 2019లో పూణే లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]గిరీష్ బాపట్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 1980లో పూణే సిటీ బీజేపీ కార్యదర్శిగా నియమితులయ్యాడు. ఆయన 1983లో జరిగిన ఉప ఎన్నికల్లో పూణే మున్సిపల్ కార్పొరేషన్‌కు తొలిసారిగా కార్పొరేటర్‌గా ఎన్నికైన ఆయన ఆ తర్వాత మూడు సార్లు కార్పొరేటర్‌గా ఎన్నికై 1986-87లో పూణే మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యాడు.
గిరీష్ బాపట్ 1995లో మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కస్బా పేట్ శాసనసభ నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1997లో కృష్ణా వ్యాలీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులయ్యాడు. గిరీష్ బాపట్ 1999, 2004, 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఫడ్నవీస్ మంత్రివర్గంలో 4 డిసెంబర్ 2014 నుండి 4 జూన్ 2019 వరకు ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల రక్షణ, ఆహారం, ఔషధాల నిర్వహణ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేశాడు. ఆయన 2019 పార్లమెంట్ ఎన్నికలలో పూణే నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
మరణం
[మార్చు]గిరీష్ బాపట్ అనారోగ్యంతో బాధపడుతూ దీనానాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో చేరి చికిత్స పొందుతూ 2023 మార్చి 29న మరణించాడు.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ Loksabha (2023). "Girish Bhalchandra Bapat" (in ఇంగ్లీష్). Archived from the original on 7 June 2023. Retrieved 7 June 2023.
- ↑ "BJP's face for four decades, Girish Bapat passes away in Pune" (in ఇంగ్లీష్). 29 March 2023. Archived from the original on 7 June 2023. Retrieved 7 June 2023.
- ↑ Namasthe Telangana (30 March 2023). "పుణే బీజేపీ ఎంపీ గిరీశ్ బాపట్ కన్నుమూత". Archived from the original on 7 June 2023. Retrieved 7 June 2023.