గిలక (హెర్నియా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Diagram of an indirect, scrotal inguinal hernia (median view from the left).

గజ్జల్లో కాని, ఉదరంలో కాని కండరాలు బలహీనపడినప్పుడు, కడుపు లోని కొవ్వు, ప్రేగులు వాటిగుండా బయటికి రావడానికి ప్రయత్నిస్తాయి. అప్పుడు బయటికి కనబడే "ఉబ్బు"ను గిలక లేదా హెర్నియా (Hernia) అంటాము.

హెర్నియా పలు రకాలు
  • 1. గజ్జల్లో వచ్చే హెర్నియా (Inguinal Hernia)
  • 2. తొడ లోపలి భాగంలో వచ్చే హెర్నియా (Femoral Hernia)
  • 3. ఉదర పైభాగంలో వచ్చే హెర్నియా (Epigastric Hernia, Umbilical Hernia, Para-Umbilical Hernia)
  • 4. శస్త్రచికిత్స ఐన తరువాత, కొంత కాలానికి, శస్త్రచికిత్సజరిగిన చోట ఏర్పడే హెర్నియా (Postoperative Incisional Hernia)
వ్యాధి లక్షణాలు

1. దగ్గినప్పుడు, బరువులను ఎత్తినప్పుడు "ఉబ్బు" కనబడుతుంది. చేతితో ఒత్తితే "ఉబ్బు"తిరిగి లోపలికి వెళ్ళిపోవచ్చు. 2. ఒక్కోసారి కడుపులోని ప్రేగులు అక్కడే చిక్కుకొని, తిరిగి కడుపు లోనికి వెళ్ళకపోవచ్చు. అప్పుడు రోగికి తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు మొదలవవచ్చు. దీనిని Strangulated Hernia అంటారు. ఇది ఎమర్జెన్సీ. త్వరగా ఆపరేషన్ చేయకపోతే రోగికి ప్రాణాపాయం కలగవచ్చు.

ఎవరికి వస్తుంది ఈ వ్యాధి ?

1. ఎక్కువగా బరువులు ఎత్తేవారిలో-వృత్తి రీత్యా , కూలీలు, హమాలీలు, రైతులు వగైరా. 2. మద్యపానం చేసేవారిలో, కొందరికి కండరాలు పలచబడుతాయి. 3. వృద్ధుల్లో. 4. ఊబకాయం గలవారికి. 5. పుట్టుకతోనే కొందరికి కండరాలు బలహీనంగా ఉండొచ్చు. వారిలో. 6. ఆపరేషన్ చేయించుకొన్న వారిలో, ముఖ్యంగా Cessarian, Tubectomy, Appendicectomy మొదలైనవి.(అంటే ప్రతి ఒక్కరికీ రావాలని ఏమీలేదు.)


వ్యాధి నిర్ధారణ పరీక్షలు
ఏమీ లేవు. వైద్యుడు కళ్ళతో చూసి, చేతితో పరీక్షించి, రోగ నిర్ధారణ చేస్తాడు.

వైద్య విధానాలు

[మార్చు]
ట్రీట్ మెంట్(Treatment)
ఏ మందులూ పని చేయవు. శస్త్రచికిత్స ఒక్కటే మార్గం.

ఇది రెండు రకాలు: 1. బలహీనపడిన కండరాలను తిరిగి గట్టి proline దారంతో కుట్టడం. 2. Proline Mesh (proline దారంతో అల్లబడిన తెర) ను వేసి కుట్టడం.

తీసుకోవలసిన జాగ్రత్తలు
శస్త్రచికిత్స తరువాత మొదటి మూడు నెలల వరకు, బరువులు ఎత్తకూడదు.

[1] అంబిలికల్ హెర్నియా బొమ్మ