గీతా మహాత్యము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వ్యాసాన్ని లేదా వ్యాస విభాగాన్ని గీతామాహాత్మ్యము వ్యాసంలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)

గీతామహత్మ్యం/ఫలశ్రుతి/గొప్పతనం*

గీతా మహాత్మ్యం గూర్చి అందరూ తెలియజేయడం విన్నాము, చదివాము.
స్వయంగా *వ్యాసభగవానులు* వారే గీత మహాత్మ్యం గురించి మహాభారతంలో భగవద్గీతను వివరిస్తూ, భగవద్గీత గొప్పతనం గురించి ఇలా అంటారు.
  • గీతా సుగీతా కర్తవ్య (గీతను ఆచరించడమే మన కర్తవ్యం) కిమన్యై: శాస్త్ర విస్తరై:I (ఇతర శాస్ర్తములతో పనిఎంటి మనకి) యా స్వయంపద్మనాభాస్య (పద్మనాభుడే చెప్పాడు) ముఖపద్మాత్వినిఃసృతాII (ఆయన ముఖారవిందం నుండి) *

అని మహాత్మ్యం తెలుపబడింది.

ఇక భగవద్గీతలో *18అధ్యాయంలో* శ్లోకం 67 లో ఎవరికి భగవద్గీత తెలియ జేయవద్దు అని,

  • 68 నుండి78 వరకు ఫలశ్రుతిలా గొప్పతనాన్ని స్వయంగా *శ్రీకృష్ణ పరమాత్మడే* చెబుతూ, *అర్జునుడు, సంజయుల* ద్వారా తెలియజేసారు
  • భగవద్గీతను ఎవరికి బోధించకూడదు/ చెప్పవద్దంటాడు?*

శ్లోకం 67 లో

  • నలుగురికి* చెప్పొద్దనుంటాడు

1.*నాతపస్కాయా*=తపో రహితుడికి 2.*నాభక్తాయా*= భక్తుడు కానివాడికి 3. *న చాశుశ్రూషవే*=వినాలనే కోరిక లేనివాడికి 4. *మాం యో౭భ్యసూయతి*=నా యెడల ఎవరు అసూయ కలిగి ఉంటారో వారికీ కావున వారికి భగవద్గీత బోధించారదు, చెప్పరాదు, వివరించారదు.

  • ఇక భగవద్గీత గోప్పతనం/ఫలశ్రుతి*
  • 68 వ శ్లోకంలో:*

ఈ పరమ రహాస్యమైన ఈ భగవద్గితను నా భక్తులకు * (మద్భక్తే ష్యభిధాన్యతి) * తెలియజేయువాడు న్ననే పొందును. అయితే ఇక్కడ భక్తియుత సేవ చేయాలి.ఎదో అలా అన్యంగా చెప్పారాదు.అలాగే భగవద్గీత పఠనం, వ్యాఖ్యానములను భక్తులకు తెలియజేయువాడు కూడా *తననే పొందుతారని* చెప్పవచ్చు.

  • 69వ శ్లోకంలో*

అంతకుమించిన ప్రియమైన భక్తుడు/సేవకుడు ఈ భూలోకంలోనే 1.లేడు (భూతకాలంలో) 2.ఉండబోదు (భవిష్యత్తులో) *నభూతో నభవిష్యతి.*

  • 70వ శ్లోకంలో* ఈ ధర్మ సంవాదాన్ని అధ్యయనం చేయువాడు నన్ను *జ్ఞానాయజ్ఞం* ద్వారా పూజించినవాడు అవుతాడు.
  • 71వ శ్లోకం*

శ్రవణం (విన్నవాడికి ) కూడా కలుగు ఫలితాలు తెలుపుతున్నారు.అయితే ఎలా వినాలి? 1.శ్రద్ధగా వినాలి,2.అసూయలేకుండా (తప్పులు/దోషాలు ఎంచకుండా) వినాలి. అలా విన్నవారు పుణ్యాత్ములు నివసించే *ఉత్తమ గతులు/పుణ్యలోకాలు పొందుతారు.*

  • 72 వ శ్లోకం* అర్జునుడునికి అడుగుతూ ఏకాగ్రతతో విన్నవా అని అడుగుతాడు పరమాత్మ. ఇక్కడ మనకి అడుగుతున్నాడు స్వామి, మీరు ఏకాగ్రతగా భగవద్గీత విన్నారా/చదివారా/అని,

అలాగే తద్వారా *నీ అజ్ఞానం నుండి పుట్టిన మొహం పోయిందా అని* అడుగుతున్నాడు.

  • అంటే భగవద్గీత పఠనం కానీ /శ్రవణం గానీ పూర్తిగా జరిగితే మనలో అజ్ఞాన నుండి పుట్టిన మొహం పోవాలి.* అప్పుడే మనలో నిజమైన మార్పు పొందినట్లుగా భావించాలి. *లేదంటే భగవద్గీత ఎన్ని సార్లు చదివినా విన్నా వృదాప్రయాస అవుతుంది.*

73 వ శ్లోకంలో *అర్జునుడుచే* గీతామహాత్మ్యం చూపిస్తున్నాడు పరమాత్మ. ఓ అచ్యుతా, నీ కరుణ వలన నాలో 1.మొహం పోయింది 2.స్మృతి కలిగింది 3.సంశయం తీరింది 4.నీ ఆజ్ఞ ప్రకారం నడుచుకునేందుకు సిద్ధమయ్యాను అని పేర్కొంటాడు. 74 వ శ్లోకం నుండి 78 వ శ్లోకం వరకు *సంజయుడు ద్వారా* గీతామహత్మ్యం తెలియజేస్తున్నారు పరమాత్మ. నేను ఈ సంవాదాన్ని వేదవ్యాసుని కృపవల్ల దివ్యదృష్టితో ప్రత్యక్షంగా విన్నాను.ఈ గీతా సంవాదం 1.అద్భుతమైనది 2.తనువును పులకరింపజేసింది 3.పుణ్యప్రథమైనది 4.అనుక్షణం స్మరించుచున్నాను 5.తద్వారా ప్రతిక్షణం ఆనంద పరవసుడిని అవుతున్నాను. 6.పరమ అద్భుతమైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ దివ్యమంగళ రూపమును స్మరిస్తూ మరల మరల ఆనందాన్ని పొందుతున్నాను. 7.శ్రీకృష్ణుడు-అర్జునుడు ఎక్కడ ఉందురో అక్కడ ౧) సంపద ౨) విజయం ౩) ఐస్వర్యయం ౪) నీతి నిలిచి ఉంటాయి. అంటే ఎక్కడ గీతా పఠనం, శ్రవణం, చర్చలు ఉంటాయో అక్కడ శ్రీకృష్ణుడు, అర్జునుడు వుంటారు అక్కడ సంపద, విజయం, అసాధారణ శక్తి, నీతి అన్ని నిలుస్తాయి.