గుడి మంజుల
గుడి మంజుల | |||
| |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
తల్లిదండ్రులు | గుడి రామకృష్ణా రెడ్డి, సుగుణమ్మ |
నెల్లూరు జిల్లా గంగపట్నం గ్రామంలో గుడి రామకృష్ణా రెడ్డి సుగుణమ్మ దంపతులకు జన్మించిన మంజులకు చిన్నతనం నుండే మొక్కలు అంటే మమకారం ఎక్కువ. మొక్కలు పెంచడానికి స్థలము లేకున్నా ఉన్న కొద్ది పాటి స్థలంలో చిన్నతనం నుండి మొక్కలు పెంచి మొక్కలపై ప్రేమను చాటుకున్నారు. ఆరో తరగతి నుండి ఫ్రెండ్స్ కు మొక్కలు షేర్ చేయడం తన దగ్గర లేని మొక్కలను సేకరించడం అలవాటుగా మారింది.
వివాహం తర్వాత బాడుగ ఇంట్లో మొక్కలు పెంచడం ఇల్లు మారినప్పుడు తనతో పాటు మొక్కలను మార్చడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. కూతురి కష్టాన్ని గమనించిన తండ్రి మొక్కలు పెంచడానికి అనువైన ఇంటిని కొనివ్వడంతో ఇక వెనుక తిరిగి చూడలేదు. ఇంటి ఆవరణలో చుట్టుపక్కల అంతా సుమారు 65 అంకణాలు విస్తీర్ణంలో 3000 రకాలకు పైగా మొక్కలు అంగుళం కంటైనర్ నుండి 100 లీటర్ల డ్రం వరకు వెయ్యికి పైగా కుండీలు లో ఎన్నో రకాల పూల మొక్కలు, లతలు, వృక్షాలు, నీటిమొక్కలు, ఎడారి మొక్కలు , 100కు పైగా పండ్ల మొక్కలు, రకరకాల కూరగాయ మొక్కలు ఒకటని లేదు ఎన్నెన్నో రకాలు తన ఇంటిలో ఆవాసం ఏర్పరచుకున్నాయి.
పనిమీద ఎక్కడికెళ్లినా, ఫంక్షన్స్ కి ఎవరి ఇంటికి వెళ్ళినా ,గుడికెళ్లినా ,బడికి వెళ్ళినా సరే తన చేతిలో ఏదో ఒక మొక్క ఉండాల్సిందే. మొక్కలేని మంజులాని ఎప్పుడు చూసి ఉండరు లంచ్ బాక్స్ లేకున్నా బ్యాగ్ లో మొక్క మాత్రం ఉండాల్సిందే. కరోనా టైంలో దొరికిన ఖాళీ సమయం, యూట్యూబ్ లో చేసిన వీడియోలు ఫలితం గా మిద్దె తోట పై ఆసక్తి కలిగి మిద్దె తోట ప్రారంభానికి నాంది పలికింది. అన్ని రకాల పండ్ల మొక్కలు ,కూరగాయ మొక్కలు మిద్దె తోటలో పెంచడంతో మొదలుపెట్టి దేశ విదేశీ పండ్ల మొక్కలు 100 రకాల పండ్ల మొక్కలు గార్డెన్లో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. [1]
ఉద్యోగరీత్యాఅవగాహన
అంగన్వాడీ టీచరుగా ఇన్చార్జి సూపర్వైజరుగా తన తోటి టీచర్లకు మొక్కలపై అవగాహన కల్పిస్తుంటారు. స్కూల్ పిల్లల చేత అంగన్వాడి కేంద్రాల్లో మొక్కలు నాటించడం పరిపాటి. సాక్ష్యం అంగన్వాడి పిల్లలకు వండే ఆహారంలో ఉపయోగించే కూరగాయలు అంగన్వాడిలోనే పండించేందుకు ప్రయతిస్తున్నారు.
మూలాలు
[మార్చు]- ↑ "తెలుగు పల్లెలకు వెలుగు దివ్వెలు " వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించిన పుస్తకం