Jump to content

పిడికిలి

వికీపీడియా నుండి
(గుప్పెడు నుండి దారిమార్పు చెందింది)
గట్టిగా బిగించిన పిడికిలి.

పిడికిలి లేదా ముష్టి (Fist) అనగా చేతి వేళ్ళను బొటన వేలితో సహా అరచేతిలోనికి ముడుచుకొని ఉండడం. దీనినే కొన్ని సందర్భాలలో గుప్పెడు అని అంటారు.

పిడికిలితో చేసే యుద్ధ క్రీడ ముష్టి యుద్ధం బాగా ప్రసిద్ధిచెందినది. సామాన్యంగా సంఘంలో కూడా పిడికిలి బిగించడం యుద్ధానికి పిలవడం అన్నమాట.

ఆహార పదార్ధాల్ని చేతితో వడ్డించేటప్పుడు పిడికిలితో గాని లేదా దోసిలితో గాని వేస్తాము. పిడికిలిలో ఒక చేయి ఉపయోగిస్తే దోసిలిలో రెండు చేతులు ఉపయోగించి ఒక పెద్ద గిన్నె మాదిరిగా చేసి దోసిలి పై వరకు పదార్ధాల్ని నింపవచ్చును.

పక్షుల వేట (Falcony) లో వేట పక్షుల్ని పిడికిలి మీద నిల్చోబెట్టుకుంటారు.

ముష్టి యుద్ధం సాధారణం గా రాజకీయ రంగములో నాయకుల పదవుల కోసం పోట్లాడే సమయములో తరచుగా దిన పత్రికలలో వార్తలు చదువుతుంటాము . అందులో 40 ఏండ్ల కిందటి రాజకీయ చరిత్రలోకి ఒకసారి మనము చుస్తే, అంతర్గత కలహాలు, కుమ్ములాటలతో మొరార్జీ ప్రభుత్వం పతనం కాగా నే " ప్రధాని పదవి కోసం ప్రతిపక్ష శిబిరంలో ముందస్తు ముష్టియుద్ధం". ఇద్దరు పెద్ద నాయకులు ప్రధాని పదవి కోసం పోటీపడ్డారు [1][2] . పూర్వ కాలములో మహాభారతము లోని ఉద్యోగ పర్వంలో రెండవ అధ్యాయములో చుస్తే "ముష్టి మాదాయ భారత " అనే పదము వ్రాసినారు[3] .

మూలాలు

[మార్చు]
  1. "ముందస్తు ముష్టి యుద్ధం - Namasthetelangaana". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-12-08.
  2. "అసెంబ్లీ లో ముష్టి యుద్ధం.. స్పీకర్ పై దాడి - TeluguMirchi.com". Telugu Mirchi (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-02-18. Retrieved 2020-12-08.[permanent dead link]
  3. Vyasa, Veda (2019-05-19). Mahabharata - Udyoga Parva 2: మహాభారతము - ఉద్యోగ పర్వము - ద్వితీయ భాగము. Ramalayam Book House.
"https://te.wikipedia.org/w/index.php?title=పిడికిలి&oldid=4338722" నుండి వెలికితీశారు