గుఫీ పెయింటల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సరబ్ జిత్ సింగ్ పెయింటల్
2010లో పెయింటల్[1]
జననం(1944-10-04)1944 అక్టోబరు 4
తర్న్ తరణ్ జిల్లా, పంజాబ్ (బ్రిటిష్ ఇండియా)
మరణం2023 జూన్ 5(2023-06-05) (వయసు 78)
వృత్తినటుడు, కాస్టింగ్ డైరెక్టర్
క్రియాశీల సంవత్సరాలు1978–2023
జీవిత భాగస్వామిరేఖా పెయింటల్
పిల్లలు1

గుఫీ పెయింటల్ (4 అక్టోబర్ 1944 - 5 జూన్ 2023) ఇతనిని సరబ్జీత్ సింగ్ పెయింటల్ అహ్లువాలియా అని కూడా పిలుస్తారు. ఇతను మహాభారతం సీరియల్ లో శకుని మామ గా ప్రసిద్ధి చెందాడు.[2] ఇతను భారతీయ నటుడు, కాస్టింగ్ డైరెక్టర్.

నట జీవితం[మార్చు]

ఇతను 4 అక్టోబర్ 1944లో తర్న్ తరణ్ జిల్లా, పంజాబ్ లో జన్మించాడు, మొదట్లో ఇంజనీర్‌గా శిక్షణ పొందాడు, ఆ తరువాత 1962లో చైనా-ఇండో యుద్ధం సమయంలో భారత సైన్యంలో చేరాడు. సరిహద్దులో రాంలీలా అనే జానపద నాటకం వేస్తున్నప్పుడు అందులో సీతగా నటించాడు,[3] అక్కడ నుండి అతనికి నటనపై ఆసక్తి పెరిగి బొంబాయికి వెళ్ళాడు. 1969లో, గుఫీ మోడలింగ్‌ చేస్తూ, సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు, వివిధ సినిమాలు, సీరియల్స్‌లో నటించాడు. అతని సోదరుడికి కూడా దర్శకత్వం వహించాడు. బిఆర్ చోప్రా, అతని కుమారుడు రవి చోప్రా నిర్మించిన మహాభారతం సీరియల్ శకుని పాత్ర ద్వారా అత్యంత ప్రసిద్ధి పొందాడు, అంతేకాకుండా పెయింటల్ శకుని వేషంతోనే సహారా సమయ్ అనే వార్తా ఛానెల్‌లో రాజకీయ చర్చా కార్యక్రమానికి యాంకర్ గా చేసాడు. ఇతను శ్రీ చైతన్య మహాప్రభు చిత్రానికి దర్శకత్వం వహించాడు.[4] 2010లో మహాభారత సీరియల్ సహనటుడు అయిన పంకజ్ ధీర్ స్థాపించిన అభినయ్ యాక్టింగ్ అకాడమీ ఫెసిలిటీ హెడ్‌గా నియమించబడ్డాడు.[5]

మరణం[మార్చు]

5 జూన్ 2023న గుండె సంబంధిత సమస్యలతో ముంబై ఆసుపత్రిలో మరణించాడు.[6][7]

ఫిల్మోగ్రఫీ[మార్చు]

చలనచిత్రాలు[మార్చు]

సంవత్సరం సినిమాలు పాత్రలు
1975 రఫూ చక్కర్ సలీం
1978 డిల్లగి గణేష్
1978 దేశ్ పరదేశ్
1994 సుహాగ్ అక్షయ్ కుమార్ మేనమామ
1995 మైదాన్-ఈ-జంగ్ మామ్జీ
1997 దావా మంగళ్ సింగ్, వన్ పీస్ కతియావాడి ఘోడో
2000 ది రివెంజ్: గీతా మేరా నామ్
2006 ఘూమ్ విజయ్ దీక్షిత్ బాస్
2013 మహాభారతం ఔర్ బార్బరీక్ శకుని
2014 సామ్రాట్ & కో. దినేష్ దాస్

టెలివిజన్[మార్చు]

సంవత్సరం సీరియల్ పాత్ర ఛానెల్
1986 బహదూర్ షా జాఫర్ డిడి నేషనల్
1988–1990 మహాభారతం శకుని డిడి నేషనల్
1988–1990 కానూన్ జస్టిస్ రఘునాథ్ డిడి మెట్రో
1992 సౌదా డిడి నేషనల్
1997–2001 ఓం నమః శివాయ శకుని డిడి నేషనల్
1998–1999 అక్బర్ బీర్బల్ ముల్లా దో ప్యాజా డిడి నేషనల్
2001 సిఐడి (భారత టీవీ సిరీస్) చందర్ ఎపిసోడ్ 195, 196
2002 ష్ .. కోయి హే డాక్టర్ జార్కోస్ స్టార్ ప్లస్
2003 మేజిక్ మేకప్ బాక్స్ బ్రితారీ జీ టీవీ
2011–2012 ద్వారకాధీశ్ భగవాన్ శ్రీ కృష్ణ్ శకుని ఇమాజిన్ టీవీ
2012–2013 మిసెస్. కౌశిక్ కి పాంచ్ బహుయేన్ బ్రిజ్‌భూషణ్ భల్లా జీ టీవీ
2013 భారత్ కా వీర్ పుత్ర్ - మహారాణా ప్రతాప్ హుమాయున్ సోనీ టీవీ
2016–2018 కర్మఫల్ దాత శని విశ్వకర్మ కలర్స్ టీవీ
2018 కర్ణ సాంగిని కృపాచార్య స్టార్ ప్లస్
2019–2023 రాధా కృష్ణ విశ్వకర్మ స్టార్ భారత్
2021–2022 జై కనియా లాల్ కీ విశ్వకర్మ స్టార్ భారత్

మూలాలు[మార్చు]

  1. "Guftagoo with Gufi Paintal". Retrieved 16 November 2019 – via YouTube.
  2. "Gufi Paintal Funeral: Mahabharat's Shakuni Mama Laid To Rest. Late Actor Receives State Salute". TimesNow. 2023-06-05. Retrieved 2023-06-06.
  3. "एक्टर बनने से पहले आर्मी में थे 'शकुनि मामा' गूफी पेंटल, चीन के बॉर्डर पर बनते थे सीता". Navbharat Times. Retrieved 2023-06-06.
  4. "Times Music : Shri Chaitanya Mahaprabhu". web.archive.org. 2008-03-09. Archived from the original on 2008-03-09. Retrieved 2023-06-06.
  5. "Akshay at Pankaj Dheer's acting academy". web.archive.org. 2010-04-12. Archived from the original on 2010-04-12. Retrieved 2023-06-06.
  6. Staff, Hamari Baat (2023-06-05). "Gufi Paintal the Shakuni Mama is sadly no more, he was 79". Hamaribaat.com - News From India And The World ! ! !. Retrieved 2023-06-06.
  7. Andhra Jyothy (5 June 2023). "బాలీవుడ్‌లో మరో విషాదం.. గుఫి పైంటాల్‌ కన్నుమూత". Archived from the original on 11 June 2023. Retrieved 11 June 2023.