Jump to content

గురు వందనం

వికీపీడియా నుండి
ఆది గురు ఫోటో

"గురు " అనే సంస్కృత పదం, గు, రు అనే రెండు మూల అక్షరాలతో రూపొందించబడింది. దీనిలో "గు "అంటే చీకటి అని ,"రు" అంటే తొలగించుట అని అర్థం . అంటే అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి మన జీవితానికి జ్ఞానమనే వెలుగు ను ప్రసాదించే వ్యక్తి యే గురువు అని అర్థం.

శ్లోకం[1][2]

[మార్చు]

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః
గురుర్దేవో మహేశ్వరః
గురుః సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః

శ్లోకం చరిత్ర

[మార్చు]

సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్లందరికీ ఈ శ్లోకం కంఠోపాఠం . ఈ శ్లోకం - వేదవ్యాస విరచిత స్కాంద పురాణాంతర్గత ప్రథమాధ్యాయం లోని "గురుగీత" యందు 58 వ శ్లోకం. ఈ గురుగీత ,స్వయంగా పరమేశ్వరుడు పార్వతికి ఉపదేశించినది. ఈ గురుగీత లో గురు శబ్ద నిర్వచనము, గురు స్వరూపము, గురు సేవా విధానం ఇంకా సద్గురు లక్షణాలు వంటి ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి.

శ్లోకం అర్థం[1]

[మార్చు]

ఈ శ్లోకంలో -గురువుని బ్రహ్మ గా , విష్ణువు గా , మహేశ్వరునిగా వర్ణించారు. బ్రహ్మ ను సృష్టి కర్తగా, విష్ణువు ను స్థితి కారునిగా, శివుణ్ణి లయకారునిగా మన పురాణాల్లో చెప్పబడింది. అంటే, మనలో మంచి ఆలోచనలను సృష్టించి, మనని ధార్మికం గా జీవించేలా చేసి, మనలోని చెడుని లయం చేయడానికి వచ్చిన త్రిమూర్త్యాత్మక పరబ్రహ్మా రూపమే "గురువు" అని మనం భావించవచ్చును.

మూలాలు :

[మార్చు]
  1. 1.0 1.1 Rao, Aravinda (2017-12-20). "గురుర్బ్రహ్మ". IndiaFacts (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-10-21.
  2. "శ్రీ గురుస్తోత్రం - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2021-10-21.