గుర్రం వెంకన్నశాస్త్రి
గుర్రం వెంకన్నశాస్త్రి | |
---|---|
జననం | 1825 నెల్లూరు జిల్లా |
మరణం | 1885 |
ప్రసిద్ధి | రచయిత |
గుర్రం వెంకన్నశాస్త్రి (1825-1885) తెలుగు రచయిత.
జీవిత విషయాలు
[మార్చు]ఇతడు నెల్లూరులో జన్మించాడు. తండ్రి రామస్వామి. వెంకన్నశాస్త్రి అన్న అప్పన్నశాస్త్రి మద్రాసు హైకోర్టులో హిందూ ధర్మశాస్త్ర పండితుడు, ఈయన హిందూ ధర్మశాస్త్రంలో మహా పండితులని పేరు తెచ్చుకొన్నాడు. హాస్యరసస్పూర్తితో సంభాషణ చేసేవాడు.ఈయనకు చతుషష్టి కళాత్మక, ఆలంకారిక సార్వభౌమ బిరుదులున్నట్లు దంపూరు నరసయ్య రాశాడు.
రచనలు
[మార్చు]1864-5 లో మద్రాసు విద్యావంతుల్లో జరిగిన రజస్వలానంతర వివాహాల గురించిన వాదవివాదాల్లో ఈయన పాల్గొని "వాదప్రహసనం" అనే చిన్న పుస్తకాన్ని రచించి 1865 అక్టోబరు 1న కంచి పీఠాధిపతికి సమర్పించాడు. ఈ పుస్తకంలో రజస్వలానంతర వివాహాలను సమర్థిస్తూ చదలువాడ అనతరామసస్త్రి చేసిన వాదాన్ని ఖండించాడు. పీఠాధిపతి ఈ గ్రంథాన్ని అనంతరామశాస్త్రి వాదానికి సమగ్ర ఖండనగా ఆమోదించాడు. వెంకన్నశాస్త్రి వెంకటగిరి సంస్థానంలో సంస్కృత పండితుడుగా ఉన్నాడు.
మూలాలు
[మార్చు]- వాదప్రహసనం సంస్కృత గ్రంథం (1866 ముద్రణ). వేదం సుబ్రమణ్యశర్మ అనువాదాన్ని వావిళ్ళ సంస్థ 1952లో ముద్రించింది
- వివాహ్య కన్యా స్వరూప నిరూపణం మద్రాసులోని శ్రీరామా దర్పణ ముద్రాక్షరశాలలో అచ్చుపడినట్లు తెలుస్తోంది. 1928 లో ఒంగోలు వెంకటరంగయ్య చేసిన తెలుగు అనువాదాన్ని కేసరి ప్రెస్, మదరాసు ప్రచురించింది
- ఇంగ్లీషు జర్నలిజంలో తెలుగు వెలుగు దంపూరు నరసయ్య, కాళిదాసు పురుషోత్తం, సొసైటీ ఫర్ సోషల్ చేంజ్, 2007 నెల్లూరు ప్రచురణ
- విక్రమ సిహపురి మండల సర్వస్వం, సంపాదకులు: యెన్.ఎస్.కె, నెల్లూరు జిల్లపరిషత్తు ప్రచురణ, 1964.