Jump to content

గూడూరు రాజేంద్రరావు

వికీపీడియా నుండి

గూడూరు రాజేంద్రరావు(జననం 1904 సెప్టెంబర్ 25, మరణం 1945 జులై 17). జీవితకాలం 39 సంవత్సరాలు.

రాజేంద్రరావు సంపన్న కుటుంబలో జన్మించి, హయిస్కూల్ చదువు తరువాత, మద్రాసులో చదివాడు. మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో ఏం.ఏ ఇంగ్షీషు పాసయాడు. రాజేంద్రరావు Sheakespere నాటకాలమీద రాసిన విమర్శ వ్యాసాలను కాలేజీ అధ్యాపకులు మెచ్చుకొన్నారు. ఆరోజుల్లో కాలేజీలో Shakespere నాటకాలలో నటించాడు, వేదము వేంకటరాయ శాస్త్రి ప్రతాపరుద్రీయ నాటకంలో ప్రతాపుని వేషంవేసి, బొబ్బిలి జమీందారు అభినందనలు అందుకొని, ఆ జమీన్.దారు సంస్థానంలో కొంతకాలం ఉద్యోగంచేశాడు. తర్వాత ప్రభుత్వోద్యోగంలో చేరి నెల్లూరు, కడప, పెద్దాపురం మున్సిపల్ కమీషనర్.గా పనిచేసి కర్నూలు మునిసిపల్ incharge కమీషనర్.గా చేస్తున్న సమయంలో రక్తహీనతవ్యాధి బారినపడి, మద్రాసు రాయపేట హాస్పిటల్.లో చికిత్స పొందుతూ అక్కడే చనిపోయాదడు. ఆయనకు సంతానం లేరు. భార్య అంత్యక్రియలు జరిపించింది.

రాజేంద్రరావు కొంతకాలం నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల ఆదివెలమ సంఘానికి అధ్యక్షుడు. ఆయన ఇంగ్లీషు, తెలుగు సాహిత్యం బాగా అధ్యయనం చేసిన వ్యక్తి. సంస్కరణ భావాలు కలిగిన ఉదారుడు. నెల్లూరు జిల్లాలోని ఆదివాసీలు యానాదుల దయనీయమయిన జీవితాలను సానుభూతితో పరిశీలించి, రచించిన 'చెంచి'కథ 1932 ఆగస్టు భారతి సంచికలో ప్రచురించబడినది. విమర్శకులు రాజేంద్రరావును ఆదివాసీల మీద రాసిన తొలి తెలుగు కథారచయితగా పేర్కొన్నారు. ఈయన మేనల్లుడు [[పెన్నేపల్లి గోపాలకృష్ణ] వివిధ పత్రికలలో ప్రచురించబడిన రాజేంద్రరావు నాటికలు, వ్యాసాలు, కథలను సేకరించి "గూడూరు రాజేంద్రరావు కథలు" పేరుతో ఒక పుస్తకం ప్రచురించాడు. రాజేంద్రరావ మరణవార్తను నెల్లూరు పత్రిక జమీన్ రైతు వివరంగా ఇచ్చింది.

మూలాలు

[మార్చు]
  • గూడూరు రాజేంద్రరావు కథలు, సంపాదకుడు: పెన్నేపల్లి గోపాలకృష్ణ, నెల్లూరు, 1976.
  • మరణవార్త : 27-జులై-17 జమీన్ రయతు సంచిక.
  • అంధ్రజ్యోతి దినపత్రిక జనవరి, 2 వ తారీకు, 2024. శ్రీ అల్లరి మోహనారావ్ గారి వ్యాసం
  • శ్రీ విక్రమ సింహాపురి మండల సర్వస్వం, నెల్లూరు జిల్లా రచయితలు, బడిగురవారెడ్డి వ్యాసం.