గూళ్ళ యాదమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గూళ్ళ యాదమ్మ కరీంనగర్ జిల్లాకు చెందిన వంటమనిషి, యాదమ్మ స్వగ్రామం సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గౌరవెల్లి గ్రామం, 5 యేటనే కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ కు యాదమ్మకు 15 యేటనే కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ కు చెందిన చంద్రయ్య తో పెళ్లి అయ్యింది. భర్తతో పాటు యాదమ్మ కరీంనగర్ చేరుకుంది. అక్కడే మంకమ్మతోటలో ఉండే వెంకన్న అనే వ్యక్తి దగ్గర వంటలు నేర్చుకుంది.[1] పదిహేను రుపాయల కూలి తో జీవితం ప్రారంభించిన యాదమ్మ వంటలు చేయడంలో నిష్ణాతురాలయ్యారు. యాదమ్మ 29 ఏళ్లుగా వంటలు చేస్తోంది, ఈమె చేసే తెలంగణా ప్రాంత శాకాహార మాంసాహార వంటకాలు ప్రాచుర్యం పోందాయి.[2]

ప్రస్థానం[మార్చు]

గూళ్ళ యాదమ్మ భర్త చంద్రయ్య కూలీ చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. వ్యవసాయ బావుల్లో పూడిక తీయడానికి వెళ్లిన చంద్రయ్య మట్టి పెళ్లలు కూలి మీదపడి, ప్రాణాలు కోల్పోయాడు.భర్త ఆకాల మరణంతో,అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఊరిలో ఉండలేక మూడు నెలల బిడ్డను తీసుకొని బతుకుతెరువుకోసం కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి చేరుకొని ఒక ప్రైవేట్‌ స్కూల్‌లో ఆయాగా కొన్నాళ్లు పని చేస్తూ వెంకన్న అనే వంట మాస్టర్‌ దగ్గర సహాయకురాలిగా చేరి అతని దగ్గర ఎక్కువ మందికి వంట చేయగల నైపుణ్యం నేర్చుకొన్నది. తరువాత స్వయంగా మహిళలతో ఒక వంటల బృందాన్ని ఏర్పాటు చేసుకొని ఇరవై వేల మంది వరకు క్యాటరింగ్‌ సర్వీసు అందిస్తున్నది.[3]

దేశ ప్రధానికి వంట[మార్చు]

దేశ ప్రధానికి వండి, వడ్డించడమంటే కనీసం అయిదు నక్షత్రాల హోటల్‌లో చేయి తిరిగిన నలభీములు అయ్యుండాలి కదా. కానీ హైదరాబాద్‌ రానున్న ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ఓ సామాన్యురాలి చేతి వంట రుచి చూడబోతున్నారు. నేపథ్యం అతి సాధారణమైనా తెలంగాణ రుచుల తయారీలో మాత్రం అసామాన్యురాలీమె. అందుకే ఏరికోరి ఎంపిక చేశారు.*

*జులై 2 నుంచి జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యే ప్రధాని నరేంద్రమోదీకి అచ్చ తెలంగాణ వంటలు రుచి చూపించాలని నిర్ణయించారు. దీనికోసం కరీంనగర్‌ జిల్లాకు చెందిన గూళ్ల యాదమ్మను ఎంపికచేశారు.

మూలాలు[మార్చు]

  1. "తెలంగాణ రుచులు... మళ్లీ మళ్లీ యాదికి రావాలె". web.archive.org. 2022-06-30. Archived from the original on 2022-06-30. Retrieved 2022-06-30.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "ప్రధాని కోసం... గరిటె తిప్పుతా." www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-06-30. Retrieved 2022-06-30.
  3. telugu, 10tv (2022-06-30). "Telangana Food: బీజేపీ సభకోసం తెలంగాణ రుచులు.. స్పెషల్ ఐటమ్స్ చేయనున్న యాదమ్మ". 10TV (in telugu). Retrieved 2022-06-30.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)