గృహవైద్యం
స్వరూపం
(గృహ వైద్యం నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
గృహవైద్యం వైద్యము అనగా మానవ ఆరోగ్యాన్ని, ఒక నిర్ధిస్టమైన నియమ నిబంధనల ద్వారా పరిరక్షించే శాస్త్రము. ఇది గాయాన్ని మాన్చే ఒక కళ . ప్రతి చిన్న అనారోగ్యానికీ అన్నివేళలా నిపుణులైన వైద్యులను సంప్రదించడం సాధ్యపడదు. అటువంటపుడు ఇంట్లో దొరికే సాదారణ వస్తువునో, పదార్దమునో, ఉపయోగించి తాత్కాలిక ఉపశయము పొందడాన్ని గృహ వైద్యం అంటాము.
గృహవైద్యములో వాడే కొన్ని పదార్దములు :
[మార్చు]- పసువు : అన్నిచోట్లా దొరికే పదార్దమే మంచి క్రిమినాశనకారిగా (Antiseptic) గా వాడుతాము.
- అల్లము : ఇది జీర్ణము అవడానికి, విరోచనము సాఫీగా అవడానికి వాడుతాము.
- మిరియాలు : శొంటి మిరియాలు కలిపి కసాయము చేసి త్రాగితే జ్వరము తగ్గుతుంది.
- బొప్పాయి: తెల్ల రక్తకణాలు.. ఎర్ర రక్తకణాలు పెంచే ఔషధం. గింజలు లివర్‌కి మంచిది. ఇందులో లభించే పెప్సీన్ అనే ఎంజైమ్ మనం తినే ఆహారంలోని ప్రోటీన్‌లను జీర్ణం చేస్తుంది.[1]
- మునగాకు: మునగాకులో విట మిన్లు, అమైనో ఆమ్లాలు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉన్నాయి. క్యారెట్ల కన్నా మునగాకులో పదిరెట్ల విటమిన్ ‘ఎ’ ఉంటుంది. కళ్ళ జబ్బులకు ఔషధంగా మునగాకును వాడుతారు.[2]
- తమలపాకు రసం: కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లకు ఈ రసం తీసుకోవడం వల్ల ఉపశమనం దక్కుతుంది. శ్వాస సంబంధ ఇబ్బందులు, ఊపిరితిత్తుల సమస్యలు, కఫ సంబంధ సమస్యలు తమలపాకు రసం తీసుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చు.[3]
- వెల్లుల్లి మజ్జిగ: ఇమ్యూనిటీ పెంచడానికి, కెలెస్ట్రాల్, శ్వాస సమస్యలు, గురక, రక్తసరఫరా సంబంధిత సమస్యలు, రక్తనాళాల్లో పూడికలు, రక్తం చిక్కబడడం మొదలైన సమస్యలకు ఉపకరిస్తుంది.
- ఆవ పిండి: ఆవపిండితో చేసిన పదార్థాలు తినడం వల్ల అంటు వ్యాధుల నుంచి రక్షణ దక్కుతుంది.
మూలాలు
[మార్చు]- ↑ "బొప్పాయి – లోకహితం" (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-07-17. Retrieved 2025-07-10.
- ↑ "మునగాకు – లోకహితం" (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-06-27. Retrieved 2025-07-10.
- ↑ ABN (2021-06-29). "వర్షాకాలం గృహవైద్యం!". Andhrajyothy Telugu News. Retrieved 2025-07-10.