గోపాలునిపల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"గోపాలునిపల్లె" ప్రకాశం జిల్లా కొమరోలు మండలానికి చెందిన గ్రామం.[1]. పిన్ కోడ్ నం. 523 373., ఎస్.టి.డి.కోడ్ = 08405.


గోపాలునిపల్లె
గ్రామం
గోపాలునిపల్లె is located in Andhra Pradesh
గోపాలునిపల్లె
గోపాలునిపల్లె
నిర్దేశాంకాలు: 15°14′28″N 78°56′35″E / 15.241°N 78.943°E / 15.241; 78.943Coordinates: 15°14′28″N 78°56′35″E / 15.241°N 78.943°E / 15.241; 78.943 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా, మార్కాపురం రెవిన్యూ డివిజన్
మండలంకొమరోలు మండలం Edit this on Wikidata
జనాభా
(2011)
 • మొత్తంString Module Error: Match not found
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08405 Edit this at Wikidata)
పిన్(PIN)523 373. Edit this at Wikidata

గ్రామ పంచాయతీ[మార్చు]

2013-జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ షేక్ అబ్దుల్ ఖాదర్, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ నాగరబొమ్మ దేవాలయం[మార్చు]

గ్రామంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో 2015,మే నెల-4వతేదీ, వైశాఖపౌర్ణమి, సోమవారం నాడు, శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణాప్రతిష్ఠా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. [2]

గ్రామ విశేషాలు[మార్చు]

గోపాలునిపల్లె గ్రామానికి చెందిన శ్రీ వీరంరెడ్డి చంద్రశేఖరరెడ్డి, ప్రభావతి దంపతుల కుమారుడైన విష్ణువర్ధన రెడ్డి, సంతమాగులూరులోని మండల కేంద్రంలోని ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుచున్నాడు. ఇతడికి చిన్నతనం నుండి చిత్రలేఖనంపై మక్కువ ఎక్కువ. పల్లెటూరి వాతావరణం, ఎలాంటి వసతులూ లేని ప్రభుత్వ పాఠశాలలలో చదివిన ఇతడు, చిన్నప్పటి నుండి పాల్గొన్న చిత్రలేఖనం పోటీలన్నిటిలో ప్రథమ బహుమతి సాధించేవాడు. తాజాగా, 2014 జనవరిలో అమలాపురంలో జరిగిన కోనసీమ చిత్రకళాపరిషత్తు నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి పోటీలలో మొదటి స్థానంలో నిలిచి, మెగా ఛైల్డ్ ఆర్టిస్ట్ ఎవార్డు తోపాటు, 4 వేల రూపాయల నగదు బహుమతి గెల్చుకున్నాడు. ఇంకా ఇతడు వ్యర్ధ పదార్ధాలతో వాల్ హ్యాంగింగ్స్, పూలబుట్టలు, ఫొటో ఫ్రేంస్, తాబేలు, నెమళ్ళ ఆకారాలు తయారుచేస్తాడు. చాక్ పీసుపై వివిధ ఆకారాల దేవుడి బొమ్మలు తయారు చేస్తాడు. [1]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం; 2014,జనవరి-28; 8వపేజీ. [2] ఈనాడు ప్రకాశం; 2015 మే-5; 5వపేజీ.