గో ఎయిర్
GoAir | ||
---|---|---|
IATA G8 | ICAO GOW | కాల్ సైన్ GO AIR |
స్థాపన | 2005 | |
మొదలు | November 2005 | |
Hub |
| |
Secondary hubs |
| |
Focus cities |
| |
Frequent flyer program | GoClub[1] | |
Fleet size | 19 | |
Destinations | 22 | |
Parent company | Wadia Group | |
కంపెనీ నినాదం | Fly Smart | |
ముఖ్య స్థావరం | Worli, Mumbai, Maharashtra, India | |
ప్రముఖులు | Jehangir Wadia Managing Director Giorgio De Roni (CEO) | |
Website: www.goair.in |
భారతదేశంలోని ముంబయి కేంద్రంగా గోఎయిర్ విమానాయాన సంస్థ స్థాపించబడింది.[2][3] వాడియాగ్రూపు ఆధ్వర్యంలో నవంబరు 2005 నుంచి దీని కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. భారత వైమానిక మార్కెట్ వాటాలో ఇది ఐదో అతిపెద్ద విమానాయాన సంస్థ.[4] ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం, న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాలు ప్రధాన స్థావరాలుగా గో ఏయిర్ కార్యకలాపాలు సాగుతున్నాయి.
చరిత్ర
[మార్చు]ప్రఖ్యాత భారతీయ పారిశ్రామిక వేత్త నుస్లీ వాడియా చిన్న కుమారుడైన జహంగీర్ వాడియా గో ఎయిర్ సంస్థను 2005లో ప్రారంభించారు. భారత వ్యాపార సామాజ్రంలో పేరుగాంచిన బాంబే డయింగ్, బ్రిటానియా ఇండస్ట్రీస్[5] సంస్థలను నిర్వహిస్తున్నవాడియా గ్రూపు[6] తొలిసారిగా వైమానిక రంగంలోకి అడుగుపెట్టింది. దీనికి జహంగీర్ వాడియా మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.[7] గో ఎయిర్, నవంబర్ 2005 ఎయిర్ బస్ ఎ320 విమానం ద్వారా తన సేవలను ప్రారంభించింది.[5]
గమ్యాలు
[మార్చు]గో ఎయిర్ భారతదేశంలోని 22 ప్రాంతాలకు విమానాలకు నడిపిస్తోంది. దేశీయంగా ప్రతిరోజు 140 విమానాలతో సహా సగటున వారానికి 975 విమానాలు నడిపిస్తోంది.[8] చిన్న విమానాలుండటం వల్ల భారత పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ నిబంధలన మేరకు గో ఏయిర్ అంతర్జాతీయంగా విమానాలు నడపడం లేదు. దరఖాస్తు చేసారు. అనుమతి రావాల్సి ఉంది.[9]
- అండమాన్&నికోబార్ దీవులు
- పోర్ట్ బ్లెయిర్–వీర్ సావర్కర్ విమానాశ్రయం
- అస్సాం
- గౌహతి– లోక్ ప్రియ గోపినాథ్ బోర్డోలో అంతర్జాతీయ విమానాశ్రయం
- బీహార్
- పట్నా– లోక్ నాయక్ జయప్రకాశ్ విమానాశ్రయం
- చత్తీస్ గఢ్
- ఛండీగర్ విమానాశ్రయం
- ఢిల్లీ
- ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(స్థావరం)
- గోవా
- గోవా అంతర్జాతీయ విమానాశ్రయం
- గుజరాత్
- అహ్మదాబాద్ –సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం
- జమ్ము -కాశ్మీర్
- జమ్ము – జమ్ము విమానాశ్రయం
- శ్రీనగర్– శ్రీనగర్ విమానాశ్రయం
- లేహ్ – లేహ్ కుశోక్ బాకుల రింపోచీ విమానాశ్రయం
- ఝార్ఖండ్
- రాంచి – బిర్సా ముండా విమానాశ్రయం
- కర్ణాటక
- బెంగళూరు– కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం
- కేరళ
- కోచి – కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం
- మహారాష్ట్ర
- ముంబయి – ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం(స్థావరం)
- నాగ్ పూర్ – డా.బాబా సాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం
- పుణె – పుణె అంతర్జాతీయ విమానాశ్రయం
- ఒడిషా
- భువనేశ్వర్ – బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం
- రాజస్థాన్
- జైపూర్ – సంగనర్ అంతర్జాతీయ విమానాశ్రయం
- తమిళనాడు
- చెన్నై – చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం
- ఉత్తర ప్రదేశ్
- లక్నో – అమౌసీ విమానాశ్రయం
- పశ్చిమ బెంగాల్
- సిలిగురి–బగ్డోగ్రా విమానాశ్రయం
- కోల్ కతా – నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం
విమానాలు
[మార్చు]డిసెంబరు 2104 నాటికి గో ఎయిర్ ఈ క్రింది విమానాలను నడిపిస్తోంది.[10][11]
విమానం పేరు | సేవలో ఉన్నవి | ఆర్డర్లు | ప్రయాణికులు | సూచనలు |
---|---|---|---|---|
ఎయిర్ బస్ A320-200 | 19 | — | 180 | ఒకటి సొంతం, 15 తాత్కాలిక అద్దె, మరో ఐదు షార్క్ లెట్స్ అమర్చారు(VT-GOL,VT-GOM,VT-GON,VT-GOO & VT-GOP) |
ఎయిర్ బస్ A320 నియో | — | 72 | TBA | 2015 లోవిడుదల |
మొత్తం | 19 | 72 |
A320 ఎన్.ఇ.ఓ ఆర్డర్
[మార్చు]ఎయిర్ బస్ ఎ320 ఎన్.ఇ.ఓ[12] (న్యూ ఇంజిన్ ఆప్షన్) రకం 72 విమానాల కోసం గో ఎయిర్ సంస్థ 324 బిలియన్లు(US $5.2 బిలియన్లు) కేటాయించింది. 2015 నుంచి ఏడాదికి 12-15 వరకు అందుబాటులోకి వస్తాయి.
ప్రత్యేక రంగులు
[మార్చు]ప్రత్యేక రంగుల్లో కనిపించే విమాన తోకలపై ఆకర్షణీయమైన నీలం-తెలుగు రంగులతో సంస్థ లోగోను ముద్రించారు. గులాబీ, ఆకాశనీలం, లేతఆకుపచ్చ, ఊదా, గోదుమ వంటి రంగుల్లోనూ విమానాలున్నాయి. గో ఎయిర్ అధికారిక వెబ్ సైట్ ను ఇంజన్లపై ముద్రించారు.
సేవలు
[మార్చు]గో ఎయిర్ విమానాల్లో ఉచిత భోజనం ఉండదు. కానీ డబ్బులు చెల్లించి భోజన వసతి పొందవచ్చు. స్నాక్స్, సాండ్ విచ్ లు, సమోస, కుకీస్, గింజలు, సాఫ్ట్ డ్రింక్స్, ఛాయ్, కాఫీ, మినరల్ వాటర్ అందుబాటులో ఉంటాయి.[13]
పురస్కారాలు
[మార్చు]గో ఏయిర్ సంస్థ ఇప్పటి వరకు ఈ క్రింది పురస్కారాలు అందుకుంది:
- 2008లో పసిఫిక్ ప్రాంత ప్రయాణ రచయితలసంఘం నుంచి నాణ్యత&అత్యుత్తమ సేవలందించినందుకు “ఉత్తమ దేశీయ ఎయిర్ లైన్స్ పురస్కారం” అందుకుంది.
- 2011లో ఏయిర్ బస్ నుంచి “ఉత్తమ పనితీరు గల ఎయిర్ లైన్స్ సంస్థగా పురస్కారం” అందుకుంది[14]
గ్యాలరీ
[మార్చు]-
Navy Blue GoAir Airbus A320-200
-
Brown GoAir Airbus A320-200
-
GoAir flight taking-off at Chandigarh Airport
-
A GoAir aircraft in pink livery at Kempegowda International Airport, Bangalore
బాహ్య లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "GoAir frequent flyer program". Archived from the original on 2013-09-01. Retrieved 2014-12-25.
- ↑ "Go Air : Contact Us". Archived from the original on 2014-12-20. Retrieved 2014-12-25.
- ↑ "GoAir joins the profit league". Business Standard. Retrieved 24 January 2014.
- ↑ "Market share".
- ↑ 5.0 5.1 "GoAir : About us". Archived from the original on 2014-12-16. Retrieved 2014-12-25.
- ↑ "Flight International".
- ↑ "Stay small till customer has a need, not want: JehWadia". The Times of India. Retrieved 30 March 2013.
- ↑ "GoAir : Destinations". Archived from the original on 2014-12-20. Retrieved 2014-12-25.
- ↑ Mishra, Lalatendu (3 March 2013). "We will not sell under cost". Chennai, India: The Hindu Business Line. Retrieved 30 March 2013.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "CH-Aviation – Airline News, Fleet Lists & More". Ch-aviation.ch. Retrieved 16 July 2010.
- ↑ "GoAir fleet". planespotters.net. Archived from the original on 21 అక్టోబరు 2013. Retrieved 21 October 2013.
- ↑ "GoAir orders 72 Airbus jets for Rs. 32,000 crore".
- ↑ "GoAir - Services and Baggage Allowance". Cleartrip.com.
- ↑ "GoAir ranked the Best Performing Airline by Airbus". Breaking Travel News. Retrieved 30 March 2013.