గ్రాహం గ్రీన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రహం గ్రీన్
OM CH
పుట్టిన తేదీ, స్థలంHenry Graham Greene
(1904-10-02)1904 అక్టోబరు 2
Berkhamsted, Hertfordshire, England
మరణం1991 ఏప్రిల్ 3(1991-04-03) (వయసు 86)
Vevey, Switzerland
వృత్తిWriter
పూర్వవిద్యార్థిBalliol College, Oxford
కాలం1925–1991
రచనా రంగంLiterary fiction, thriller
జీవిత భాగస్వామి
(m. 1927; sep. 1947)
భాగస్వామిCatherine Walston, Lady Walston (1946–1966)
Yvonne Cloetta (1966–1991)
సంతానంLucy Caroline (b. 1933)
Francis (b. 1936)

గ్రహం గ్రీన్ అక్టోబర్ సా.శ.1904 లో జన్మించారు. ఈయన ప్రఖ్యాత ఆంగ్ల నవలా రచయితలలో ఒకరు. ఈయన నోబల్ బహుమతి పొందడానికి పలుసార్లు ఎంపికచేయబడ్డారు. కానీ చివరికి లభించలేదు. ప్రొటెస్టెంట్ మతస్థుడుగా పుట్టిన గ్రీన్ తన ఇరువది యేట రోమన్ కాధోలిక్ మతాన్ని పుచ్చుకున్నాడు. కొందరు విమర్సకలు ఆయనని క్యాథలిక రచయితగా పరిగణించినా, గ్రీన్ తనను తాను క్యాథలిక్ రచయితగానే చెప్పుకున్నాడు.గ్రీన్ రచనా వైశిష్ట్యానికి, ఆలోచనా సరళికీ, తాత్విక దృష్టికి సరైన న్యాయం చేకూర్చాలంటే అతనిని క్యాథలిక్ రచియితగా కంటే మానవతావాది అయిన భావుకునిగా, ద్రష్టగా పరిగణించడం సమంజసం. గ్రీన్ సాధించిన ఘన విజయం ఆతని నవలలో ద్యోతకమయ్యే అమూల్యమైన మోద తాత్త్విక దృష్టి (కామిక్ విషన్) ఆంగ్ల సాహిత్యంలోని కామెడీ, ట్రాజెడీ అనే రెండు విభాగాలూ మ ుఖ్యసాహిత్య ప్రక్రియలు.రచనా వ్యాసంగాన్ని గ్రీన్ ఒక రోగ చికిత్సా విధానం (తెరపీ)గా ఎంచాడు. రచనలు చేయని, సంగీతం కూర్చని, లేదా చిత్రించని వాళ్ళు మానవస్థితిలో ఉన్న ఉన్మాదాన్ని, విచారాన్ని, ఘోరభయాన్ని ఎలా తప్పించుకోగలరని ఒక్కోసారి నేను ఆశ్చర్యపడుతూ ఉంటాను అంటాడు గ్రీన్. జీవితం ఎడల గ్రీన్ అవగాహనలోను, దృష్టిలోను గమనార్హమైన పురోభవృద్ధి పరిణీతి ఉన్నాయి. గడచిన గ్రీన్ రచనా జీవితంలో ముఖ్యంగా మూడు దశలు కనబడుతాయి. మొదటి దశలో కెవలం ఖేద దృష్టిలో అంతర్వాహినిగానే తాత్త్విక దృష్టి కనబడుతుంది. 1938లో ప్రచురించిన బ్రయిటన్ రాక్ (Brighton Rock) గ్రీన్ రచనా జీవితంలో మొదటి దశను పరిపూర్తి కనిపిస్తుంది. రెండవదశలో గ్రీన్ తన తాత్త్విక దృష్టి అభివృద్ధి చెందిన రచనలు కనిపిస్తాయి.ఈ దశలో ముఖ్యమైనది ది పవర్ ఎండ్ ద గ్లోరీ (The Power and The Glory). ఈ దశలో మిగిలిన నవలలకూ మూడవదశలో తీవ్ర తాత్విక దృష్టిలో వెల్లివిరిసిన నాలుగు నవలలకు మధ్య గ్రీన్ అవగాహనా బలం 1960లో ప్రచురించిన ఎ బర్ణ్ట్ అవుట్ కేస్ (A Burnt Out Case) లోపూర్తిగా తెలుస్తుంది. ప్రతి గొప్ప రచయితలోను స్ఫటికీకరణ జరిగి, అతని దృష్టిలోని అతిముఖ్యమైన విషయం స్పష్టంగా చెప్పబడి, అతని ఆంతరంగిక విశ్వం చదువరులందరికి స్పష్టమయ్యే క్షణం వస్తుందని గ్రీన్ తను హెన్రీ జేమ్స్ మీద వ్రాసిన వ్యాసంలో చెప్పాడు. ఆయన ఏప్రల్ 3 1991లో స్విట్జెర్లాండ్ లో మరణించారు.

రచనలు[మార్చు]

  • ది మాన్ వితిన్ (The Man Within) (1929)
  • స్టాంబాలు ట్రైన్ (Stamboul Train) (1932)
  • ఇట్స్ ఎ బ్యూటిల్ ఫీల్డ్ (It's a Battlefield) (1934)
  • ఇంగ్లాండ్ మేడ్ మి (England Made Me (1935)
  • ఎ గన్ ఫర్ సేల్ (A Gun for Sale) (1936)
  • జర్నీ వితవుట్ మ్యాప్స్ (Journey Without Maps) (1936)
  • బ్రైటన్ రాక్ (Brighton Rock) (1938)
  • ద లాలెస్ రోడ్స్ (The Lawless Roads](1939)
  • ద కాంఫిడెంషియల్ ఏజెంట్ (The Confidential Agent) (1939)
  • ద పవర్ ఎండ్ గ్లోరీ (The Power and the Glory) (1940)
  • ద మినిస్ట్రీ ఆఫ్ ఫియర్ (The Ministry of Fear) (1943)
  • ద హార్ట్ ఆఫ్ ద మ్యాటర్ (The Heart of the Matter) (1948)
  • ద థర్డ్ మ్యాన్ (Third Man) (1949)
  • ద ఎండ్ ఆఫ్ ద ఎఫైర్ (The End of the Affair) (1951)
  • ట్వంటీ వన్ స్టోరీస్ (Twenty-One Stories) (1954)
  • లూసర్ టేక్స్ ఆల్ (Loser Takes All) (1955)
  • ఎ సార్ట్ ఆఫ్ లైఫ్ ([A Sort of Life) (1971)
  • ద హ్యూమన్ ఫాక్టర్ (The Human Factor) (1978)
  • వేస్ ఆఫ్ సాక్సస్ (Ways of Escape) (1980)
  • డాక్టర్ ఫిసర్ ఆఫ్ జెనీవా ([Doctor Fischer of Geneva) (1980)
  • మానిసర్ క్విక్సోట్ (Monsignor Quixote) (1982)
  • ద టెంత్ మాన్ (The Tenth Man ) (1985)
  • ద లాస్ట్ వర్డ్ (The Last Word ) (1990) (short stories)

మూలాలు[మార్చు]

  • 1980 భారతి మాసపత్రిక. వ్యాసము:గ్రేహంగ్రీన్- మోదతాత్విక దృష్టి. వ్యాసకర్త:డా.వి.వి.బి.రామారావు.