Jump to content

ఎర్తింగ్

వికీపీడియా నుండి
(గ్రౌండింగ్ నుండి దారిమార్పు చెందింది)
ఎర్తింగ్[1]

ఎర్తింగ్ లేదా గ్రౌండింగ్ అనగా ఎలక్ట్రికల్ సర్క్యూట్లను భూమికి అనుసంధానించడం. విద్యుత్ శక్తి పంపిణీ వ్యవస్థ యొక్క భద్రత విషయంలో ఎర్తింగ్ చాలా ప్రముఖమైనది.

ఎలక్ట్రికల్ సర్క్యూట్లు భూమికి విద్యుత్ కనెక్షన్ చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇలా

1. విద్యుత్ షాక్ నుండి వ్యక్తి యొక్క రక్షణ.
2. విద్యుత్ పరికరాలను ఒల్టేజి యొక్క హెచ్చుతగ్గుల కారణంగా కాలిపోకుండా, పాడవకుండా చూసేందుకు.
3. కొన్ని సర్క్యూట్లలో భూమిని కండక్టర్‌గా ఉపయోగిస్తారు, కాబట్టి వైర్లు లేదా కేబుల్‌లను విడిగా కనెక్ట్ చేయవలసిన అవసరం లేదు.


ఎలక్ట్రిక్ పరికరంలో విద్యుత్ వైరు యొక్క ఇన్సులేషన్ కత్తిరించబడి లేదా దెబ్బతిన్నబడి పరికరం యొక్క బాడీకి విద్యుత్ వస్తున్నప్పుడు వ్యక్తుల శరీరం తాకినప్పుడు అందులో ప్రవహిస్తున్న విద్యుత్ ప్రవాహం వ్యక్తి శరీరం ద్వారా భూమిని చేరుతుంది, ఆ విధంగా వ్యక్తి విద్యుత్ షాకుకు గురౌతాడు. అయితే విద్యుత్ పరికరానికి ఎర్తింగ్ సౌకర్యం ఉన్నట్లయితే అధిక విద్యుత్ ఎర్తింగ్ వైరు ద్వారా భూమికి చేరుతుంది కాబట్టి వ్యక్తిపై విద్యుత్ ప్రవాహము యొక్క తీవ్రత అంతగా కనిపించదు, ప్రమాదం యొక్క స్థాయి చాలా తక్కువగా ఉంటుంది లేదా అసలు ఉండదు.

విద్యుత్ షాక్ నుండి రక్షణకు, విద్యుత్ పరికరాల భద్రతకు ప్రతి ఇంటిలో ఎర్తింగ్ సౌకర్యాన్ని ఏర్పరచుకుంటున్నారు. ప్రతి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ దగ్గర ఈ ఎర్తింగ్ ను ఏర్పాటుచేస్తారు. పెద్దపెద్ద భవానాలలో, సంస్థలలో ఈ ఏర్పాటు తప్పనిసరిగా ఉంటుంది. పిడుగుల నుంచి రక్షణకు ఈ ఎర్తింగ్ సదుపాయాన్ని చాలాకాలము నుంచే ఉపయోగిస్తున్నారు.

మూలాలజాబితా

[మార్చు]
  1. To keep impedance low, ground wires should avoid the unnecessary bends or loops shown in this picture. Holt, Mike (14 November 2013). "Grounding - Safety Fundamentals". youtube video. Mike Holt Enterprises. Retrieved 4 February 2019.
"https://te.wikipedia.org/w/index.php?title=ఎర్తింగ్&oldid=2909155" నుండి వెలికితీశారు