గ్లాన్-థాంప్సన్ పట్టకం
గ్లాన్-థాంప్సన్ పట్టకం ఒక పోలరైజింగ్ పట్టకం. ఇది నికోల్ అండ్ గ్లాన్-ఫోకాల్ట్ పట్టకాని పోలి ఉంటుంది. ఈ పట్టకం రెండు లంబ కోణ కాల్సైట్ పట్టకాలను కలిగి ఉంటుంది. ఆ రెండు పట్టకాలను వాటి దీర్ఘ ముఖాల ద్వారా ఒకదానికొకటి కలిపి అమర్చుతారు. ఈ రెండు పట్టకాల ఆప్టికల్ ఆక్సెస్ లు ఒకదానికొకటి సమాంతరంగా, ప్రతిబింబ తలానికి సమలేఖనమై ఉంటుంది. పట్టకంలోకి ప్రవేశించే కాంతి కిరణాన్ని రెండు ఉపపట్టకాలు కలిసే తలం వద్ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లో తేడా వల్ల రెండుగా విడిపోతాయి. పి-పోలరైజ్ అయిన సాధారణ కాంతి రేఖ కాల్సైట్ సిమెంట్ పొర వద్ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కి గురి అవుతుంది. ఎస్-పోలరైజ్డ్ అసాధారణ కాంతి రేఖ బయటకి వెలువడుతుంది. అందువల్ల ఈ పట్టకాన్ని పోలరైజింగ్ బీం స్ప్లిట్టర్ గా వాడవచ్చు. మొదట్లో కెనడా బాల్సం ను సిమెంటింగ్ కు వాడేవారు, కానీ ఇప్పుడు ఆధునిక పాలిమర్లను వాడుతున్నారు.[1]
ఈ పట్టకానికి దగ్గరగా ఉండే గ్లాన్-ఫొకాల్ట్ పట్టకంతో పోల్చుకుంటే గ్లాన్-థాంప్సన్ పట్టకానికి విస్తృతమైన ఆమోద కోణాన్ని, గరిష్ఠ కిరణీకృతత అత్యల్పంగా ఉంటుంది. (ఇందుకు కారణం సిమెంట్ పొర వద్ద కాంతి క్షీణత)
మూలాలు
[మార్చు]- ↑ Bennett, Jean M . (1995). "Polarizers". In Bass, Michael, Ed. Handbook of Optics Volume II (2nd ed.). McGraw-Hill. pp. 3.10–3.11. ISBN 0-07-047974-7.