గ్లోబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గ్లోబు అనగా ఒక త్రిమితీయ స్కేల్ పద్ధతిలో రూపొందించబడిన భూమి లేదా భూగోళం (గ్రహాంతర గ్లోబ్ లేదా భౌగోళిక గ్లోబ్) యొక్క నమూనా, లేదా గ్రహము లేదా చంద్రుడి వంటి ఇతర ఖగోళ వస్తువు యొక్క నమూనా వంటిది. అయితే నమూనాలు అనియత లేదా అపక్రమ ఆకృతులతో తయారు చేయబడి ఉండవచ్చు, ఈ గ్లోబ్ అనే పదం దాదాపుగా గోళాకార వస్తువుల యొక్క నమూనాలకు మాత్రమే ఉపయోగిస్తారు. ఈ "గ్లోబ్" పదం లాటిన్ పదం గ్లోబస్ నుండి వచ్చింది, దీనర్థం గుండ్రని ద్రవ్యరాశి లేదా ఉండ. కొన్ని భూగోళ గ్లోబ్స్ భూమి ఉపరితలం మీది పర్వతాలు, ఇతర రూపాలను మరింత స్పష్టతతో చూపించేలా గుంతలమెట్టలతో కూడా రూపొందించబడ్డాయి. ఈ గ్లోబులలో ఆకాశ సంబంధ గ్లోబులు లేదా ఖగోళ సంబంధ గ్లోబులు అని పిలవబడేవీ కూడా ఉన్నాయి, ఇవి ఆకాశంలో నక్షత్రాల, పాలపుంతల యొక్క స్పష్టమైన స్థితులను చూపించే ఖగోళ గోళాల యొక్క గోళాకార ప్రాతినిధ్యాలు.

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • ఎర్తా - ప్రపంచములోనే అతిపెద్ద గ్లోబు
"https://te.wikipedia.org/w/index.php?title=గ్లోబు&oldid=3588251" నుండి వెలికితీశారు