గ్లోరియా స్వాన్సన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్లోరియా స్వాన్సన్
1941లో స్వాన్సన్
జననంగ్లోరియా మే జోసఫైన్ స్వాన్సన్
(1899-03-27)1899 మార్చి 27
షికాగో, ఇలినాయిస్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు
మరణం1983 ఏప్రిల్ 4(1983-04-04) (వయసు 84)
న్యూయార్క్ సిటీ, అమెరికా సంయుక్త రాష్ట్రాలు
విశ్రాంతి ప్రదేశంచర్చ్ ఆఫ్ ద హెవెన్లీ రెస్ట్, న్యూయార్క్ సిటీ
ఇతర పేర్లుగ్లోరియా మే
వృత్తి
  • నటి
  • నిర్మాత
క్రియాశీలక సంవత్సరాలు1914–1983
రాజకీయ పార్టీరిపబ్లికన్
భార్య / భర్త
వాలేస్ బీరే
(m. 1916; div. 1918)
హెర్బర్ట్ కె. సోంబార్న్
(m. 1919; div. 1922)
హెన్రీ దె లా ఫాలైస్
(m. 1925; div. 1931)
మైఖేల్ ఫార్మర్
(m. 1931; div. 1934)
విలియం డవే
(m. 1945; div. 1946)
పిల్లలు3
సంతకం

గ్లోరియా మే జోసెఫైన్ స్వాన్సన్ (1899 మార్చి 27 – 1983 ఏప్రిల్ 4) అమెరికన్ నటి, నిర్మాత. 1920ల్లో డజన్ల కొద్దీ మూకీ సినిమాల్లో నటించి సుప్రసిద్ధురాలైంది. మూడుసార్లు ఉత్తమ నటి విభాగంలో ఆస్కార్ అవార్డుకు నామినేషన్ పొందింది. వీటిలో సన్‌సెట్ బౌలెవార్డ్‌కు గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా వచ్చింది.

స్వాన్సన్ చికాగోలో జన్మించింది. వారిది సైనిక కుటుంబం కావడంతో తరచు ఒక బేస్ నుంచి మరొక బేస్‌కు మారుతూండేది. అలా వివిధ ప్రాంతాల్లో ఆమె పెరిగింది. ఎసానే స్టూడియోకు చెందిన నటుడు ఫ్రాన్సిస్ ఎక్స్. బుష్‌మేన్ మీద ఆమెకు ఉన్న ఆకర్షణ వల్ల షికాగోలో అతని స్టూడియోకి టూర్‌కి తీసుకువెళ్ళమని తన ఆంటీని కోరింది. అలా వెళ్ళినప్పుడు అప్పటికి 15 సంవత్సరాల వయసున్న స్వాన్సన్‌కి ఒక సినిమాలో చిన్న పాత్రకు ఆఫర్ వచ్చింది. అలా ఆమె సినిమా కెరీర్ ప్రారంభమైంది. త్వరలోనే ఆమెను మాక్ సెనెట్‌కు చెందిన కీస్టోన్ స్టూడియోస్‌లో బాబీ వెర్నాన్ సరసన కామెడీ షార్ట్స్‌లో నటించడానికి తీసుకున్నారు.