ఘటిక : ఘటికాస్థానం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దక్షిణభారతంలో విద్యావ్యాప్తికి తోడ్పడి, కాలగర్భంలో యిమిడిపోయిన పురాణ విద్యా సంస్థలను ఘటిక-ఘటికాస్థానాలు అంటారు.ఘటిక అన్నది గోష్ఠి లేక బ్రాహ్మణుల సభ అని కూడా అంటారు.ఆర్యులు దక్షిణాపధంలో ప్రవేశించి తమ తమ మతము సంప్రదాయములు, సంస్కృతి, వ్యాప్తి చేయడానికి వారికి దేవాలయములు, మఠము, ఘటిక అన్నవి మూడూ చాలా తోడ్పడ్డవి.అవి సజీవములై నేటికి కూడా హిందువులలో చాలామంది జీవితాలతో అవినాభావమయిన సంబంధం కలిగి ఉన్నాయి. కాని వాటితో పాటు పుట్టిన ఘటిక అన్న విద్యాసంస్థ మాత్రం కాలగర్భంలో కలిసిపోయింది.వీటిని గురుంచి పాత శసనాల బూజు దులిపే యే కొద్ది మందో తప్ప జన బాహుళ్యానికి దీనిని గురుంచి తెలియదు.వి దక్షిణాపధంలో 3,4 వ శతాబ్దములనుండి 11,12 వ శతాబ్దములవరకు ప్రబలిన విద్యాసంస్థలివి.

ప్రాచీన శాసనాలలో ఘటిక

[మార్చు]

ప్రాచీన ఆంధ్ర శాసనాలలోనూ, కన్నడ శాసనాలలోనూ ఘటిక, ఘటికాస్థానము, ఘడియారము, ఘడిశాసి అన్న పదములూ వాటి పర్యాయపదములైన ఘటికాశాల, ఘడెశాసి, ఘడియాశాసి మొదలైనవి తరుచు కనబడుతున్నవి.ఘటిక అన్న ఈవిద్యాసంస్థ ముఖ్యంగా దక్షిణ భారతంలో మాత్రమే వ్యాప్తి చెందింది.ఘటిక అన్న ఈపదము, మొదతిసారిగా మనకు కదంబవంశ రాజన్యుడైన కాకుత్స వర్మ తలగుండ శాసనములో కనిపిస్తున్నది.తలగుండ అన్న ఈ గ్రామం మైసూరు సంస్థానంలోని షిలోగా జిల్లాలోని షికార్పూర్ తాలూకాలో ఉంది. దీనిలో ఘటికాస్థానంగురుంచి చేసిన ప్రస్తావన వలన, తలగుండ శాసనదాతి కదంబ కాకుత్సవర్మ పూర్వీకుడైన మయూరశర్మ, కాంచీపురంలో ఉన్న ఘటికాస్థానికి, విద్యాభ్యాసముకొరకో లేదా అక్కడ వారిని జయించడం కొరకో వెళ్ళినట్లు తెలుస్తుంది. తలగుండ శాసనం, లిపిస్వరూపాన్ని అనుసరించి సా.శ. 5 వ శతాబ్దము నాటిదని పండితుల అభిప్రాయము.

పల్లవ రాజధాని కాంచీపురంలోని ఘటికాస్థానంలో విద్యనభ్యసించడానికో, వాక్చండిమఘటశాసుల చర్చ గెలుచుటకో, కదంబ మయూరశర్మ, అక్కడకి వెళ్ళినట్లు తెలుస్తోంది.కాని శాసనములో తార్కుకః అని ఉందనీ, హేమచంద్రుని అభిదాన చింతామణిలో తార్కుక శబ్దానికి యాచకుడని అర్ధం ఉందనీ, అందుచేత మయురశర్మ కాంచీపురానికి విద్య అభ్యసించడానికి మాత్రమే వెళ్ళాడని చెప్పవచ్చును.కాంచీపురం ఆనాటికి, విద్యాసంస్థలకి పేరుపొందింది.ఆపేరు ప్రఖ్యాతలకి కారణం అక్కడి ఘటికాస్థానములే!

అటు తరువాత, ఘటిక శబ్దము మూడవ విజయనందవర్మ వేలూరి పాలియం శాసనములో ఉదహరించబడింది.దీనిలో స్కందశిష్యుడు సత్యసేనుని వద్దనుంచి ఒక ఘటికను సాధించినట్లు రెండవ నరసింహవర్మ బ్రాహ్మణుల ఘటికను పునరుద్ధించినట్లు ఉంది.3 వ శతాబ్దానికి చెందిన విష్ణుకుండి మాధవవర్మ పులింబూరు శాసనంలో మాధవ వర్మ తాను యధావిధి వినిర్వాపిత ఘటికావ్యాప్తపుణ్య సంచయ డని వర్ణించుకున్నాడు.

తూర్పు చాళుక్య వంశ స్థాపకుడైన కుబ్జ విష్ణు వర్ధనుని కుమారుడు ప్రథమ జయసింహ వల్లభుని నిడుపూరు శాసనంలో కూడా ఈఘటికాస్థాన ప్రస్తావన ఉంది. ఈ శాసనం అసనపురవాసక ము నుండి దానము చేయబడింది. అనేక శతాబ్దాలబాటు ఆంధ్రదేశంలో ఇచ్చట ఘటికాస్థానములు విద్యావ్యాప్తికి తోడ్పడ్డాయి.ఈ శాసనంలో ప్రథమ జయసింహ వల్లభుడు, రెండు వేదాలలో నిధి అని పేరుగాంచి వేదవేదాంగములలో శిక్షపొందిన కేతశర్మకి నిడుబుర్ర అన్న గ్రామాన్ని దానం చేసినట్లు ఉంది.

పాల్కురికి సోమనాధుడు కృత బసవ పురాణం లో, శ్రీ కృష్ణదేవరాయ విరచిత ఆముక్తమాల్యదలో ఈ ఘటిక శబ్దము వాడబడింది.

ఈవిధంగా ప్రాచీన ఆంధ్రశాసనములలోనూ, ఆంధ్ర వాజ్మయములోనూ విరివిగా ఉదహకృతమైన ఈ సంస్థ ప్రసక్తి ఉత్తర భారత శాసనములలో వేటిలోనూ కనిపించదు.శుభాకరుని శాసన మొకదానిలో మాత్రం ఘడిగ్రామిన్ అన్న ప్రయోగం కనిపిస్తోంది. ఓఢ్రదేశం బహుశ ఈ ఆంధ్రసంస్థని అనుకరించి ఉండవచ్చును.నాస్తిక

ఘటిక- మఠము

[మార్చు]

మఠాలు మతప్రచారానికి ఉద్దేశించిన సంస్థ. ద్వైతా ద్వైత విశిష్టాద్వైతముల ప్రచారమున ఇవి ఉద్దేశింపబడినవి.ఘటికాస్థానము అట్టిది కాదు.వైదిక లౌకిక వాజ్మయాలలో విద్యాభ్యాసానికి ఉపకరించినది ఘటిక. నాస్తిక సిద్ధాంతాలను, శున్యవాదులను, ఎదుర్కొని వైదిక సిద్ధాంత రక్షణకి తోడ్పడినవి ఘటికలు. ఇవి సాధారణంగా ఆలయములకు చేర్చిఉండెడివి.ఆలయ ప్రాంగణములలోనూ మండపాలలోను విద్యాభ్యాసం జరుగుచుండెడిది.దాన ధర్మాలు, ఆలయములకూ, ఈ విద్యాసంస్థలకీ కలిపి చేసేవారు. ఈ ఘటికాస్థానములలో విద్యాబోధకులని ఘటిశాసి ఘటశాసులు అనేవారు.వారందరు అఖండమైన ప్రజ్ఞావంతులు అవడం చేత ఆశబ్దమునకు పెద్ద పండితుడన్న అర్ధం కలిగింది.

మూలము

[మార్చు]