Jump to content

చండిక (సినిమా)

వికీపీడియా నుండి
చండిక
(1940 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆర్.ఎస్.ప్రకాష్
నిర్మాణం మిర్జాపురం మహారాజ
రచన ముత్తనేని వెంకట చెన్నకేశవులు(కథ),
కొప్పొరపు సుబ్బారావు(సంభాషణలు)
తారాగణం కన్నాంబ,
వేమూరి గగ్గయ్య,
బళ్లారి రాఘవ,
లలితాదేవి,
పెద్దాపురం రాజు,
అరణి సత్యనారాయణ,
పువ్వుల రత్నమాల
సంగీతం కొప్పొరపు సుబ్బారావు
ఛాయాగ్రహణం కమల్ ఘోష్
నిర్మాణ సంస్థ భవాని పిక్చర్స్
నిడివి 184 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

చండిక 1940 లో వచ్చిన తెలుగు జానపద చిత్రం. రఘుపతి సూర్యప్రకాష్ దర్శకత్వంలో భవానీ పిక్చర్స్ పతాకాన బళ్లారి రాఘవాచార్య, కన్నాంబ నటించగా చండిక చిత్రాన్ని నిర్మించారు. ఇందులో ఇద్దరికీ మంచి పేరొచ్చింది.[1] [2]

చండిక (కన్నంబ) ఒక రాజ్యానికి యువరాణి. గిరిరాజు (గగ్గయ్య) రాజు తీర్పుపై ఆమె అసంతృప్తిగా ఉంది. ఆమె అతన్ని తొలగించి, యువరాజైన తన భర్తను రాజగా చెయ్యాలని కోరుకుంటుంది. ఆమె మహారాజును ఆకర్షించి అతన్ని చంపింది. ఎన్కౌంటర్ సమయంలో, ఆమె తన భర్తను కోల్పోతుంది. ఆమె మంత్రి వీరమల్లు (రాఘవ) ను నియంత్రించలేకపోతుంది. చివరికి ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది.

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: ఆర్ ఎస్.ప్రకాష్
  • కధ: ముత్తనేని వెంకట చెన్న కేశవులు
  • మాటలు: కొప్పరపు సుబ్బారావు
  • సంగీతం: కొప్పరపు సుబ్బారావు
  • ఛాయా గ్రహణం: కమల్ ఘోష్
  • నేపథ్య గానం: పసుపులేటి కన్నాంబ, కొప్పరపు సుబ్బారావు, మాస్టర్ విశ్వం, జె.శేషగిరిరావు, పువ్వుల అనసూయ, టి.లలితాదేవి, వై.రాజు
  • నిర్మాణ సంస్థ: భవాని పిక్చర్స్
  • నిర్మాత: మీర్జాపురం మహారాజు
  • విడుదల:12:04:1940.

పాటల జాబితా

[మార్చు]

1. ఆనందమాయే నహా ఈ వేళ ఆనందమాయే ఆహా ఆహా - పి. కన్నాంబ

2.ఏమే ఓ కోకిలా ఏమో పాడేదవు ఎవరు నేర్పినది యీ ఆట- పి.కన్నాంబ

3.నేనే రాణినైతే ఏలనే ఈ ధర యేక ధాటిగా- పి.కన్నాంబ

4.వందే భవాని ఆశ్రిత పోషిణి అనంతరూప ధారిణి - పి.కన్నాంబ

5.ఉద్యోగం ఉద్యోగం అంటే ఊరికే వస్తుందా- జె.శేషగిరిరావు, పువ్వుల అనసూయ

6.ఎదురులేదు ప్రజల శక్తి కెదురులేదురా భయము మదిని- బృందం

7.చేయరా వేడుక చేయరా వేడుక నేడు రేపు రేపే- బృందం

8.పతి ప్రేమకు దూరమై పడతి శోభ అడవి గాచిన వెన్నెల - టి.లలితాదేవి

9.పరుగిడరా పరుగిడరా రణ భూమికి ధీరులు పోయే భూమికి- పి.కన్నాంబ

10.మన పురగిరికే జయమాయనుగా ఎంతో సుదినమే నేడు- బృందం

11.మేలుకోరా సోదరా మేలుకో నిదుర నా భారత సోదరా- టి.లలితాదేవి

12.రణభేరి అదిగో మ్రోగేనురా ఓ భారతవీరా - టి.లలితాదేవి, శ్రీమతి వై.రాజు

13.హిందుస్థాన్ హిందుస్థాన్ మముగన్న తల్లి యీ హిందుస్థాన్- బృందం

14 . హైలెస్సా హైలెస్సా.,..సీతారాములు దయచేసారు- బృందం

15.ఎవరి కూడు కుడిచి ఎవరి గుడ్డను కట్టి(పద్యం)- కె.సుబ్బారావు

16.ప్రభువు ఉప్పు పులుసుల వల్ల పెంపైనట్టి (పద్యం)- కె.సుబ్బారావు

17.మ్రొక్కులు మ్రొక్కు వారలకు ముంగిటి పెన్నిధి (పద్యం)- పి.కన్నాంబ

18.రాచ పుండువునకు రణమందు మృతికన్న (పద్యం)- మాస్టర్ విశ్వం

19.రామ రామ శ్రీరామారామా రామా రఘురామ(బుర్రకథ)- .

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]