చతుర్ముఖం
చతుర్ముఖం | |
---|---|
దర్శకత్వం | రంజిత్ కమల శంకర్ సలీల్ |
రచన | అభయకుమార్ కె అనిల్ కురియన్ |
నిర్మాత | జిస్ టామ్స్ , జస్టిన్ థామస్ మంజు వారియర్ |
తారాగణం | మంజు వారియర్, సన్నీ వెనె, శ్రీకాంత్ మురళి |
ఛాయాగ్రహణం | అబినందన్ రామానుజం |
కూర్పు | మనోజ్ |
సంగీతం | డాన్ విన్సెంట్ |
నిర్మాణ సంస్థలు | జిస్ టామ్స్ మూవీస్, మంజు వారియర్ ప్రొడక్షన్స్ |
పంపిణీదార్లు | సెంచరీ రిలీజ్ |
విడుదల తేదీ | ఆగస్టు 13, 2021 |
సినిమా నిడివి | 138 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
చతుర్ముఖం 2021లో విడుదలైన తెలుగు సినిమా. మంజు వారియర్, సన్నీ వెనె, శ్రీకాంత్ మురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు రంజిత్ కమల శంకర్ సలీల్ దర్శకత్వం వహించాడు. మలయాళంలో 8 ఏప్రిల్ 2021లో విడుదలైన ‘చతుర్ముఖం’ తెలుగులో అదే పేరుతో డబ్బింగ్ చేసి ట్రైలర్‌ను ఆగష్టు 10, 2021న విడుదల చేసి,[1] ఆహా ఓటీటీలో సినిమాను ఆగష్టు 13, 2021న విడుదల చేశారు.[2][3]
కథ
[మార్చు]తేజస్విని (మంజు వారియర్) మధ్య తరగతి కుటుంబానికి చెందిన మహిళ .ఆమె తన స్నేహితుడు ఆంటోనితో కలిసి సీసీటీవీ సోల్యుషన్స్ వ్యాపారాన్ని చేస్తుంటుంది. ఆమె తన మొబైల్ ఫోన్‌కు విపరీతంగా అలవాటు పడుంటుంది. ఓ ప్రమాదంలో ఆ ఫోన్ పని చెడిపోతుంది. కొత్త ఫోన్‌ను కొన్న తేజస్విని (మంజు వారియర్) జీవితంలో ఆతీంద్రియ శక్తుల కారణంగా అనేక ఘటనలు జరగుతాయి. ఆ ఘటనల వెనుకున్న విషయాలను తేజస్విని ఎలా తెలుసుకుంది. తన స్నేహితులు సన్నీ వైనే, శ్రీకాంత్ మురళిల సాయంతో ఆ సమస్యలను నుంచి ఎలా బయటపడిందనేదే కథ.
నటీనటులు
[మార్చు]- మంజు వారియర్
- సన్నీ వెనె
- అలెన్సెర్ లే లోపెజ్
- నిరంజన అనూప్
- బాబు అన్నూర్
- శ్యామప్రసాద్
- రోనీ డేవిడ్
- శ్రీకాంత్ మురళి
- షాజు శ్రీధర్
- కళాభవన్ ప్రజోద్
- బాలాజీ శర్మ
- నివాస్ వాళ్లిక్కును
- సారంజిత్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్:జిస్ టామ్స్ మూవీస్, మంజు వారియర్ ప్రొడక్షన్స్
- నిర్మాత: జిస్ టామ్స్, మంజు వారియర్
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రంజిత్ కమల శంకర్ సలీల్
- సంగీతం: డాన్ విన్సన్ట్
- సినిమాటోగ్రఫీ: అబినందన్ రామానుజం
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (10 August 2021). "కంటికి కనిపించని దుష్టశక్తితో పోరాటం.. ఉత్కంఠ రేపుతున్న 'చతుర్ముఖం' ట్రైలర్". Archived from the original on 15 ఆగస్టు 2021. Retrieved 15 August 2021.
- ↑ NTV (5 August 2021). "ఆహాలో మంజు వారియర్ 'చతుర్ముఖం'". Archived from the original on 15 ఆగస్టు 2021. Retrieved 15 August 2021.
- ↑ Andrajyothy (5 August 2021). "ఆగస్ట్ 13న 'ఆహా'లో అరుదైన హారర్ థ్రిల్లర్ చిత్రం". Archived from the original on 15 ఆగస్టు 2021. Retrieved 15 August 2021.