చరాచర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చరాచర్
చరాచర్ సినిమా పోస్టర్
దర్శకత్వంబుద్ధదేవ్ దాస్‌గుప్తా
రచనబుద్ధదేవ్ దాస్‌గుప్తా
ప్రఫుల్లా రాయ్ (నవల)
నిర్మాతగీతా గోప్, శంకర్ గోప్
ఛాయాగ్రహణంసౌమేందు రాయ్
కూర్పుఉజ్జల్ నంది
సంగీతంబిస్వాదేప్ దాస్‌గుప్తా
విడుదల తేదీs
1993
7 ఫిబ్రవరి 1996 (ఫ్రాన్స్)
సినిమా నిడివి
97 నిముషాలు
దేశంభారతదేశం
భాషబెంగాలీ

చరాచర్, 1993లో విడుదలైన బెంగాలీ సినిమా. ప్రఫుల్లా రాయ్ రాసిన నవల ఆధారంగా బుద్ధదేవ్ దాస్‌గుప్తా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఉత్తమ చలన చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారంను అందుకుంది. ఇందులో శంకర్ చక్రవర్తి, ఇంద్రాణి హల్దార్, రజిత్ కపూర్ తదితరులు నటించారు.[1]

కథా నేపథ్యం

[మార్చు]

తన చిన్న కొడుకు మరణించిన తరువాత, పక్షులు పట్టే కుటుంబం నుండి వచ్చిన లఖిందర్, బందీలుగా ఉన్న పక్షులను విడుదలచేయాలనుకుంటాడు. ఆ సమయంలో అతని భార్య అతనినుండి విడిపోతుంది. కలకత్తాలోని పక్షులమార్కెట్ క్రూరత్వాన్ని తిరస్కరించి, అక్కడికి వెలుతాడు. చివరికి తన భార్యను కూడా విడుదల చేస్తాడు. పనోరమిక్, ట్రాకింగ్ షాట్‌లతో కూడిన ఈ లిరికల్ మూవీ చివరలో పక్షులు అతని గుడిసెలోకి ప్రవేశించి, అతన్ని రక్షిస్తాయి.

నటవర్గం

[మార్చు]
  • శంకర్ చక్రవర్తి
  • ఇంద్రాణి హల్దార్ (గౌరీ)
  • రజిత్ కపూర్ (లఖిందర్‌)
  • సాధు మెహర్ (భూషణ్)
  • మనోజ్ మిత్రా
  • లాబోని సర్కార్ (సారీ)

ఇతర సాంకేతికవర్గం

[మార్చు]
  • చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్: అరుణ్ గుహతకుర్తా
  • అసిస్టెంట్ డైరెక్టర్: బిస్వాదేబ్ దాస్‌గుప్తా
  • స్క్రీన్ ప్లే: బుద్ధదేవ్ దాస్‌గుప్తా
  • సౌండ్ రికార్డింగ్: జ్యోతి ఛటర్జీ, అనుప్ ముఖర్జీ
  • అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్: పూర్ణేందు బసు
  • ఆర్ట్ డైరెక్టర్: షతదాల్ మిత్రా
  • మేకప్: డెబి హాల్డర్
  • ప్రొడక్షన్ కంట్రోలర్: సోమనాథ్ దాస్, జయంత కుండు

అవార్డులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Charachar (1993)". Indiancine.ma. Retrieved 2021-06-19.
  2. "Berlinale: 1994 Programme". berlinale.de. Archived from the original on 2017-10-01. Retrieved 2021-06-19.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=చరాచర్&oldid=3827869" నుండి వెలికితీశారు