చర్చ:అంగజాల జగన్నాథయ్య
స్వరూపం
ఇటువంటి వ్యాపారవేత్తలు దాదాపు అన్ని ఊళ్ళల్లోనూ ఉంటారు. ఈ వ్యాసం లక్ష్యం ఏమిటి. జగన్నాధయ్య గారి గొప్పతనం విజ్ఞాన సర్వస్వంలో ప్రత్యేక వ్యాసం వ్రాయటానికి అవసరం వ్యాసంలో ఎక్కడా కనపడలేదు. బలిజిపేట గ్రామం వ్యాసంలో లేదా సాలూరు వ్యాసంలో, ఆ గ్రామ ప్రముఖునిగా ఈయన గురించి వ్రాయవచ్చునేమూ పరిశీలించగలరు.--SIVA 20:58, 24 డిసెంబర్ 2008 (UTC)
- ఈ వ్యాసానికి తగిన మూలాలు చేర్చగలిగితే బావుంటుంది. ఇక ఈ వ్యాసం ఉంచాలా లేదా అనేది మరింత సమాచారం ఈయన గురించి (ముఖ్యంగా స్వతంత్ర పోరాట సమయంలో ఈయనకు సంభందించిన విషయాలు ఏవనా ఉంటే) మరియు ఇతర వివరాలు చేర్చగలిగితే ఈ వ్యాసంతో పాటు మరికొన్ని వ్యాసాలతో ఆంధ్రప్రదేశ్ ప్రముఖ వ్యాపారవేత్తల వర్గం ఒకటి సృష్టించవచ్చు.విశ్వనాధ్. 07:34, 2 జనవరి 2009 (UTC)
- బలిజిపేట గ్రామం వ్యాసంలో "ప్రముఖులు" విభాగంగా ఈ వ్యాసాన్ని (అతిశయోక్తులు, పొగడ్తలు తగ్గించి) ఉంచవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:23, 2 జనవరి 2009 (UTC)