చర్చ:ఆమ్నాయం
Jump to navigation
Jump to search
ఇది ఆమ్నాయ స్త్రోత్రమా??--మాటలబాబు 16:52, 14 సెప్టెంబర్ 2007 (UTC) కొంతవరకు. దీనిని బాగా సంస్కరించాలి.----కంపశాస్త్రి 16:59, 14 సెప్టెంబర్ 2007 (UTC)
- అమ్నాయం అంటే ఏంటి? --వైజాసత్య 17:34, 14 సెప్టెంబర్ 2007 (UTC)
- ఉదాహరణకు శంకరాచార్యులు నాలుగు మఠాలు స్థాపించారు.వాటిని ఆమ్నాయ మఠాలు అని పిలుస్తారు.నాకు ఆమ్నాయం అంటే అసలు అర్థం తెలియదు. శాస్త్రి గారు చెప్పాలి. ఆదిశంకరాచార్యుల వ్యాసములొ ఆ విషయాలు మరింత విఫులంగా విశ్వనాధ్ గారు వ్రాశారు.
శృంగేరి - దక్షిణామ్నాయం
పూరి- పూర్వామ్నాయం
ద్వారక-పశ్చిమ్నాయం
- జ్యోతిర్మఠం,బదరికాశ్రమం-ఉత్తరామ్నాయం. ఆమ్నాయం అంటే సాంప్రదాయం. వేదాలు నాలుగింటినీ నాలుగు మఠాలకు, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి, అప్పచెప్పాడు శంకరాచార్యుడు. ఏమఠానికి అప్పచెప్పిన వేదాన్ని ఆమఠం వాళ్లు, నిత్యం వల్లె వేస్తూ, వల్లె వేయిస్తూ (అధ్యయనం, అధ్యాపనం), ఆ వేదాన్ని సస్వరంగా,సుస్వరంగా నిలబెట్టాలి. ఏసందర్భంలోనైనా ఏ వేదం విషయం లో నైనా అనుమానం వస్తే, తత్సంబంధమైన మఠామ్నాయం ప్రమాణం. పాఠభేదాలు రావచ్చు గాని స్వరభేదం రాకూడదు. దీనిని నిర్దుష్టంగాను, నిర్దిష్టంగాను పరంపరగా పాటిస్తున్నారు కనుకనే స్వరప్రధానమైన వేదాలు వేలసంవత్సరాలుగా నిలిచిఉన్నాయనుకోవచ్చును. ప్రారంభంలో ఏ మఠాలు ఏప్రాంతాలలో ఏ బాధ్యతలతో ఏర్పడ్డాయో చెప్పేవి ఆమ్నాయ శ్లోకాలు.----కంపశాస్త్రి 20:40, 14 సెప్టెంబర్ 2007 (UTC)
- బాగా అర్ధమయ్యేట్టు వివరించినందుకు శాస్త్రిగారికి కృతజ్ఞతలు. దీన్ని ఈ వ్యాసానికి ప్రవేశికగా చేర్చితే బాగుంటుందనుకుంటా --వైజాసత్య 20:50, 14 సెప్టెంబర్ 2007 (UTC)
ఆమ్నాయం గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. ఆమ్నాయం పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.