Jump to content

చర్చ:ఆస్తిక హేతువాది

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

"ఆస్తిక హేతువాద సిద్ధాంతాలకు మంచి ఉదాహరణలు - ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం, సూఫీతత్వము, ఇస్కాన్ వగైరాలు. " - అని వ్రాశారు.

ఇక హేతువాద సిద్ధాంతాలు కానివేమిటి? - ద్వైతులు విశిష్టాద్వైతాన్ని ఆమోదించరు. ఇస్కాన్ వారు అద్వైతాన్ని చాలా నిశితంగా విమర్శిస్తారు. అంటే ఒకరికి మరొకరు నిర్హేతుకమైన వాదులన్నమాట. మరొక విషయం - వాదించే ప్రతివారూ తాము హేతుబద్ధంగానే వాదిస్తున్నామంటారు. కనుకనే "ప్రామాణికమైన మూలాలతో" వ్యాసాలు వ్రాయాలని కోరుతున్నాను. తెలుగు వికీలో "హేతువాదం" గురించిన విషయాలు అత్యధికంగా మూలాలు లేకుండా ఉన్నాయి. తెలిసినవారు వీటిని సవరించమని మనవి. రచయితలకు ఇవి self evident truths అనిపించవచ్చును. కాని ఇతరులకు అలా అనిపించవు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:29, 6 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]