చర్చ:ఉత్తరమీమాంస

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఉత్తర మీమాంస అనగా కేవలం బ్రహ్మసూత్రములు మాత్రమే కాదు. నాకు తెలిసినంత వరకు తెలియ చెప్ప తలచినాను. మనకు వేదములు నాలుగు. ఆందు ప్రతి వేదమునందు, ప్రధమ భాగము పూర్వ మీమాంస కాగా, ఉత్తర భాగమును ఉత్తర మీమాంస గా పరిగణించినారు. ఫ్రధమ భాగమైన పూర్వ మీమాంస ఖర్మకాంఢను అనుసరించు మంత్రములు. ఉత్తర మీమాంస జ్నానకాంఢ విభాగము. మొదటి భాగమును అపర విద్య అనియు, రెండవ భాగమును పర విద్య అనియు చెప్పియున్నారు.

వేదములు అపౌరుషేయములు. అనగా వ్యక్తులచేత వ్రాయబడినవి కావు. పరమాత్మ నుండి సాక్షాత్తుగా శబ్ధరూపములో వినబడినవిగను, వానిని వినిన ఋషులు గ్రంధస్తము చెసినారని పెద్దలు చెప్పగా వినినాము. పర, అపర విద్యలు రెండునూ అపౌరుషేయములే.

ఉత్తర మీమాంస, అనగా రెండవ భాగమైన జ్నానకాండను, వేదాంతములు, ఉపనిషత్తులనియు తెలియవలయును. ఈ మూలములపై తదుపరి వెలువడిన బ్రహ్మసూత్రములు (భాదరయణులవారిచే విరచితములు) నుండి నైష్కర్మ సిద్ది వగైరా సిద్ది పేరులతోను, వివేకచూడామణి లాంటి ప్రకరణ గ్రంధము లన్నియు ఉత్తర మీమాంస శీర్షిక క్రింద చేర్చవలయును. షడ్ధర్శనములు శీర్షికలో కోడా పూర్వ,ఉత్తర మీమాంస విషయమును గురించి ప్రస్తావన వున్నది.

ఇంకను వివరములకు, స్వామీజీలను, అనగా స్వామి దయానంద సరస్వతి, కోయంబత్తూరు, స్వామి పరిపూర్నానంద గారు,కాకినాడ సంప్రదించిన చాలా విషయములు సేకరించ వచ్చును.