Jump to content

చర్చ:ఎర్రచందనం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఎర్రచందనం వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2008 సంవత్సరం, 41 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


ఎర్రచందనం వికీపీడియా నుండి ఎర్ర చందనం Pterocarpus santalinus - Köhler–s Medizinal-Pflanzen-114.jpg శాస్త్రీయ వర్గీకరణ రాజ్యం: ప్లాంటే విభాగం: మాగ్నోలియోఫైటా తరగతి: మాగ్నోలియోప్సిడా క్రమం: Fabales కుటుంబం: ఫాబేసి ఉప కుటుంబం: Faboideae జాతి: Dalbergieae జాతి: టిరోకార్పస్ ప్రజాతి: P. santalinus ద్వినామీకరణం Pterocarpus santalinus L.f.

ఎర్ర చందనం అత్యంత విలువైన కలప : దీన్ని ఎర్ర బంగారం అని కూడా అంటారు.ఎర్ర చందనం (ఆంగ్లం Red sandalwood) చెట్టు వృక్ష శాస్త్రీయ నామం Pterocarpus santalinus. ఇది ఆంధ్రప్రదేశ్ లో తప్ప మరెక్కడా పెరగదు. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కేవలం నాలుగు జిల్లాలలో మాత్రమే పెరుగుతుంది. చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలలో విస్తరించి వున్న నల్లమల అడవులలో మాత్రమే ఈ ఎర్ర చందనం చెట్లు పెరుగుతాయి. ఈ చెట్టు కలపతో చేసే వాయిద్యాన్ని జపాన్ లో సంగీత సాధనం గా ఉపయోగిస్తారు. ఆ సంగీత సాధనం ప్రతి ఇంటిలో ఉండటం వాళ్ళ ఆచారం. దీని కలప పొట్టుని కలర్ ఏజెంట్ గా వాడతారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కలప ఎగుమతి చేయడాన్ని నిషేధించింది. అయిననూ దీనికి చాలా విలువ ఉండటచే కొంతమంది దొంగతనంగా ఎగుమతి (స్మగ్లింగ్) చేస్తుంటారు. దొంగ రవాణాలో పట్టు బడ్డ ఎర్రచందనం దుంగలు

దీనికి విదేశాలలో అత్యధిక విలువ వున్నందున ప్రాణాలకు తెగించి ఈ కలపను దొంగ రవాణా చేసి ఇతర దేశాలకు తరలించి కోటాను కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారు స్మగలర్లు. ఈ విధంగా లక్షల కోట్ల విలువైన ఎర్ర చందనం విదేశాలకు తరలి పోతున్నది.

ఇదివరకు జపాన్దేశం ఎర్రచందనాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకునేది. ఈ కలపతో వారు బొమ్మలు, సంగీతపరికరాలు తయారు చేసుకునేవారు. ఇప్పుడు చైనాదేశం ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నది. వీరు ఈ కలపను బొమ్మలు, సంగీత పరికరాలు, వాస్తు సంబంధపరికరాలు వంటి వాటికి ఉపయోగిస్తున్నారు. ఈ కలపతో చేసిన వస్తువు తమఇంటిలో వుంటే అంతా కలిసి వస్తుందని వీరి నమ్మకం. దీని నుండి వయాగ్రా కూడా తయారు చేస్తారు. అంతే గాక దీని నుండి సుగంధ ద్రవ్యాలు, మందులు, ఇలా అనేక రకాల ఉత్పత్తులు చేస్తున్నారు.

ఈ కలప దొంగ రవాణాదారులు తమ ప్రాణాలు పోయినా .. అటవీ శాఖ సిబ్బందిని చంపైనా తమ కార్య కలాపాలను సాగిస్తున్నారు. ఈ నాలుగు జిల్లాలలో ఈ దొంగ రవాణ విషయంలో కొన్ని వేల వాహనాలు పట్టుబడ్డాయి. అలాగే కొన్ని వేలమందిని కూడా నిర్భంధించారు. అయినా దొంగరవాణాను అరికట్టలేకపోతున్నారు. అటవీశాఖ సిబ్బంది పై దాడులకు సైతం తెగబడుతున్నారు. ఒక ఎర్రచందనం దుంగను కొట్టి తమ స్థావరానికి చేర్చడానికి ఒక్క కూలికి ఒక్కరాత్రి సమయం పడుతుంది. అంత మాత్రానికే ఆ కూలీకి కొన్ని వేలరూపాయలు ముట్ట జెప్పుతారు స్మగ్లర్లు. దాని వలన వారు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. అత్యధిక ఆదాయం వున్నందునే కూలీలు ఎంతటి ధారుణానికైనా తెగ బడుతున్నారు. పట్టుబడి అటవీశాఖ వారి గోదాముల్లో నిల్వ వున్న ఎర్రచందనం విలువ కొన్ని లక్షలకోట్ల విలువ వుంటుంది. ఇక కను గప్పి విదేశాలకు తరలి పోయిన ఎర్ర చందనం విలువ ఎంత వుంటుందో ఊహాతీతమే.

ఎర్రచందనం గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి