చర్చ:ఎ.టి.ఎం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎ.టి.ఎం అనగా "ఆటోమాటిక్ టెల్లర్ మషీన్" అనగా మనం మీట నొక్కగానే మనకు కావాల్సిన సమాచారం అందించటం, ఈ యంత్రం ను బ్యాంకు లు తమ వినియోగ దారులకు అందుబాటులో ఉంచుటకు ఉపయోగిస్తారు. దీనిని 1967 సం: లో ఇంగ్లాండ్ లోని ఎన్ ఫీల్డ్ నగరం లో కను గొన్నారు. ఈ యంత్రం నందు డబ్బులు సులభంగా తీసుకొనవచ్చును, కొన్ని అత్యవసర సమయాల్లో ఈ యంత్రం చాలా ఉపయోగ పడుతుంది. బ్యాంకు నందు డబ్బులు తీసుకొనుటకు బ్యాంకు పని వేళల్లో మాత్రమే పొందవచ్చు. కాని ఈ యంత్రం అందుబాటు లో వచ్చినప్పటి నుండి బ్యాంకు ముసి ఉన్న సమయాలల్లో కూడా డబ్బులు తీసుకొనుటకు మంచి అవకాశం గా ఉన్నది, దీనిని పెద్ద పెద్ద వ్యాపారుల దగ్గర నుంచి చిన్న తరహా వ్యక్తుల వరకు కుడా ఉపయోగించుచున్నారు. దీనికి కావలసినదంతా ఏదైనా ఒక జాతీయ బ్యాంకు నందు ఖాతా కలిగి ఉండటం సరిపోతుంది. వివిధ రకాల బ్యాంకు లు తమ సర్వీసులను పెంపొందించు కొనుటకు, విస్తృత పర్చుకోనుటకు ప్రజలు ఎక్కువ నివాసాలు ఉన్న చోట ఈ యంత్రం లను ప్రారంభించి తమ సేవలను ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నాయి.



పేదం తుకారాం సలుగుపల్లి, మం: బెజ్జూరు, ఆదిలాబాద్ జిల్లా