చర్చ:ఐక్యతా ప్రతిమ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఐక్యతా ప్రతిమ వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2014 సంవత్సరం, 35 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


సంస్థానాలను విలీనం చేసి భారతదేశ సమైక్యతకు పాటుపడిన సర్దార్ వల్లభాయ్ పటేల్ రూపంలో నిర్మిస్తున్న ఒక స్మారక కట్టడం పేరు స్టాట్యూ ఆఫ్ యూనిటీ. దీనిని తెలుగులో ఐక్యతా ప్రతిమ లేక ఐక్యతా విగ్రహం అని అంటారు. ఈ విగ్రహాన్ని గుజరాత్‌లో నర్మదానది మధ్యలో సర్దార్ సరోవర్ డ్యాంకు మూడు కిలోమీటర్ల దూరంలో నిర్మించేందుకు నిర్ణయించి నరేంద్రమోడీ శంకుస్థాపన చేశారు.

గుజరాత్‌లో జన్మించిన సర్దార్ పటేల్ ఖ్యాతిని అంతర్జాతీయంగా చిరస్థాయిగా నిలపాలని నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంకల్పించి శ్రీకారం చుట్టారు. గుజరాత్‌లో 182 నియోజక వర్గాలున్న నేపథ్యంలో పటేల్ విగ్రహం ఎత్తు 182 మీటర్లు ఉండేట్లుగా నిర్మిస్తున్నారు. అంటే ఈ విగ్రహం ఎత్తు 597 అడుగుల ఎత్తు ఉండేలా దీనిని నిర్మిస్తున్నారు. 19వేల చదరపు కిలోమీటర్ల వ్యాసార్ధంలో 2500 కోట్ల భారీ ఖర్చుతో పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ విగ్రహం నిర్మాణానికి మూడు నుంచి మూడున్నర సంవత్సరాల సమయం పడుతుందని అంచనా. దీని కోసం 2500 టన్నుల ఇనుమును వినియోగించనున్నారు.

పై వ్యాసంలోని కొలతలలో 19000 చదరపు కిలోమీటర్ల వ్యాసార్థం సందేహాస్పదంగా వున్నది. వ్యాసార్థాన్ని చదరపు కిలోమీటర్ల లో కొలవరు. అదియును గాక 19000 కిలోమీటర్ల వ్యాసార్థము అంటే దాని వైశాల్యం = (సూత్రము) వృత్త వైశాల్యము (A)= πr2 అవుతుంది. = వైశాల్యము = 22/7 x 19000 x 19000 = 361000000 చదరపు కిలోమీటర్లు? గుజరాత్ రాష్ట్ర వైశాల్యం =( విస్తీర్ణము) = 196,024 చ.కి.మీ ..... ......  ???????????...... ఇది నా సందేహం మాత్రమే...... పొరబాటైతే సరిదిద్దండి. నేనే పొరబాటైతే మన్నించండి.......Bhaskaranaidu (చర్చ) 17:20, 7 ఆగష్టు 2014 (UTC)