చర్చ:కందం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కందపద్యం వ్యాసం నుండి[మార్చు]

అందంగా కందంలో పద్యాలు రచించిన కఫులలో తిక్కన ఒకడు. కంద పద్యం తెలుగు దనానికి ప్రతీక. కంద పద్య రచనకు నియమాలు ఎక్కువ. కందంలో నాలుగు పాదాలుంటాయి. మొదటి పాదంలో మూడు గణాలు, రెండవ పాదంలో ఐదు గణాలు ఉంటాయి. అట్లే మూడు , నాలుగు గణాలు కూడా మొదటి , రెండు గణాలను పోలి ఉంటాయి. కంద పద్యంలో

గగ, భ, జ, స, నల అనే గణాలు ఉంటాయి. 

బేసి గణాల్లో జ గణం ఉండరాదు. రెండవ పాదం మూడవ గణం జ గణం కానీ, నలం కానీ అయి ఉండాలి. రెండు , నాలుగు పాదాలలో మొదటి అక్షరానికి నాలుగవ గణం మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. రెండు , నాలుగు పాదాలలో చివరి అక్షరం గురువు అయి ఉండాలి. ప్రాస నియమం పాటింపబడాలి.

క్రింది కంద పద్యాన్ని చూడండి.

నీ పాద కమల సేఫయు నీ పాదార్ఛకులతోడి నెయ్యము నితాం తాపారభూతదయయును తాపస మందార నాకు దయ సేయగదే.( భాగఫతం)

"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:కందం&oldid=3232388" నుండి వెలికితీశారు