చర్చ:కుంతీదేవి
Jump to navigation
Jump to search
కుంతీదేవి మహాభారతం లో పాండవుల తల్లి. పాండురాజు భార్య. కుంతీదేచి చిన్నతనంలో దుర్వాసుడు ఆమెకు ఒక వరం అనుగ్రహించాడు. ఈ వరం ప్రకారం, ఆమె తాను కోరుకున్నప్పుడు ఏ దేవుడైనా ప్రత్యక్షమయ్యి వారి వలన ఆమెకు సంతాన ప్రాప్తి కలిగేలా ఒక వరం ప్రసాదించాడు. ఆమె వరం నాకెందుకు ఉపయోగపడుతుందని అడగగా భవిష్యత్తులో అవసరమౌతుందని బదులిస్తాడు. ఆమె ఆ మంత్రాన్ని పరీక్షించడం కోసం ఒక సారి సూర్యుని కోసం ప్రార్థిస్తుంది. ఆమె తెలియక మంత్రాన్ని జపించాననీ, సూర్యుణ్ణి వెనక్కి వెళ్ళిపోమని కోరుతుంది. కానీ మంత్ర ప్రభావం వల్ల ఆమెకు సంతానం ప్రసాదించి కానీ తిరిగివెళ్ళలేనని బదులిస్తాడు. ఆమెకు కలిగే సంతానాన్ని ఒక బుట్టలో పెట్టి నదిలో వదిలివేయమని కోరతాడు. అలా సహజ కవచకుండలాలతో, సూర్య తేజస్సుతో జన్మించినవాడే కర్ణుడు.
'కుంతి అంటే:
[మార్చు]కుంతి యాదవుల ఆదబిద్ద. వసుదేవుని చెల్లలు, శ్రీ క్రిష్ణుని మేనత్త.ఆమె అసలు పేరు పృధ. కుంతిభోజుడనే రాజు సంతానము లేక, ఈమెను పెంచుకున్నాడు.అందుచేత ఈమె కుంతి అయింది.