చర్చ:క్రైస్తవ ప్రార్థన
పేరు మార్పు ప్రతిపాదన
[మార్చు]ఈ వ్యాసము పేరు "ప్రభువు ప్రార్థన" అంటే స్పష్టముగా లేదు. కనుక " క్రైస్తవ ప్రార్థన" అనే పేరుకు తరలించవలెనని నా అభిప్రాయము. ̍̍̍ కాసుబాబు 07:26, 24 నవంబర్ 2006 (UTC)
- అవును క్రైస్తవ ప్రార్ధన సమంజసమైన పేరు. అక్కడికి తరలిస్తున్నారు. రవి ప్రసాద్ గారూ, ఇది కేవలం లూథరన్ల ప్రార్ధనేనా? లేక కాథలిక్కులు, బాప్టిస్టులు మరియు ఇతర ప్రాటెస్టెంటు క్రైస్తవులు కూడా ఇలాగే ప్రార్ధిస్తారా? --వైఙాసత్య 11:07, 24 నవంబర్ 2006 (UTC)
- ఆంగ్ల వికిలో లార్డ్స్ ప్రేయర్ అనే వ్యాసం ఉంది. అది, ఇది ఒకటేనా ?? --వైఙాసత్య 11:37, 24 నవంబర్ 2006 (UTC)
మిత్రులు వైజాసత్య గారికి, కాసుబాబు గారికి వికిపూర్వక నమస్సులు. ప్రభువు ప్రార్థన అన్నది సార్వత్రికంగా పిలువబడే పదం. క్రైస్తవ ప్రార్థన అనే మకుటం బాగుంది గాని అది విస్త్రుత అర్థాన్ని సూచిస్తుంది. అయినా మీ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను. ఆ పేజీలో మీరు చేసిన మార్పులకు హ్రుదయ పూర్వక ధన్యవాదాలర్పిస్తునాను. వైజాసత్య గారూ! ఈ ప్రార్థనను కాథలిక్కులతో పాటు చాలా ఇతర ప్రోటెస్టెంటు సంఘాల వారు వాడతారు. అందుకని మొదట ప్రార్థనను పేర్కొని ఆ తదుపరి దానిని గూర్చి లూథర్ వ్రాసిన వివరణ ఇవ్వటం జరిగింది. ఆంగ్ల వికిలోని ప్రభువు ప్రార్థన చాలా విస్త్రుత వ్యాసం. అయితే ఏ భాషలోనైనా ప్రభువు ప్రార్థన మూలం ఒక్కటిగానే ఉంటుంది. ఒకటి రెండు రోజులాలో మరింత వివరణ జతచేయటానికి ప్రయత్నిస్తాను. మరో మారు మీ ప్రోత్సాహక ఆదరాభిమానాలకు క్రుతజ్ఞతలు.
భవదీయుడు
రవి ప్రసాద్
- ఇకమీదట చర్చా పేజిలో మీరు కొత్తగా రాసినది పేజీలో క్రింద భాగములో చేర్చండి. ఇది ఒక చిన్న ఆనవాయితే అంతే. దేనికి సమాధానముగా మీరు ఎది రాసారో అని క్రమముగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఆ ఆంగ్ల వ్యాసము చదివిన తర్వాత కానీ చాలా రకాల ప్రార్ధనలుంటాయని తెలియలేదు. ఒకవెళ లార్డ్స్ ప్రేయర్, ఈ ప్రార్ధన ఒకటే అయితే ఈ వ్యాసాన్ని తిరిగి ప్రభువు ప్రార్ధన అన్ని నామకరణం చెయ్యొచ్చు. మీరిన్ని సార్లు కృతజ్ఞతలు చెప్పక్కరలేందండి. తెలుగు భాషకు ఏదో మాకు తోచిన సహాయము మేము చేస్తున్నామంతే --వైఙాసత్య 15:02, 24 నవంబర్ 2006 (UTC)
దేవుడు - క్రీస్తు
[మార్చు]దేవుడు అని ఉన్నచోట క్రీస్తు అని మార్చటం సమంజసం కాదనుకుంటాను ఎందుకంటే క్రైస్తవ త్రిత్వంలో దేవుడు, బిడ్డ(క్రీస్తు), పరిశుద్ధాత్మ మూడంకాలు. --వైజాసత్య 16:20, 25 ఆగష్టు 2010 (UTC)