చర్చ:గరికపాడు (వైరా మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కాసు బాబు గారు, ఈ అన్నం భట్టు గారు గుంటురు జిల్లా, క్రోసూరు మండలనికి చెందిన గరికపాడు అగ్రహారానికి గరికపాడు (క్రోసూరు మండలం) చెందినవారు, గరికపాటి వంశచరిత్ర - గరికపాటి లక్ష్మీ నరసింహం గారిచే రచింపబడిన పుస్తకంలో శాసనాల ఆధారంగా నిరూపించారు. మీ వద్ద దీనికి ప్రతీప ఆధారాలు ఉంటే నేను చూడ గోరతాను. -़़़ 04:11, 5 ఏప్రిల్ 2009 (UTC)


మీరు చక్కగా పరిశీలించి వ్రాసినందుకు కృతజ్ఞతలు. ఆ పుస్తకం (తెలుగు సాహిత్య కోశము. - తెలుగు అకాడమీ)లో "గరికపాడు (నైజాం మండలం)" అని ఉంటే అది వైరా కావచ్చునని నేను ఊహించి ఈ గరికపాడులో వ్రాసినట్లున్నాను. మీకు ఖచ్చితంగా తెలిసినట్లయితే విషయాన్ని "గరికపాడు (క్రోసూరు మండలం)కు మార్చేయండి. . --కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:59, 5 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

అప్పటి కాలంలో గరికపాడు ఆగ్రహరం (క్రోసూరు మండలం), నైజాము నవాబు పరిపాలనలో ఉండడము వలన ఈ విధమైన తికమక ఏర్పడి ఉండవచ్చును. ఈ విషయాన్ని, గరికపాటి వంశచరిత్ర - గరికపాటి లక్ష్మీ నరసింహం గారిచే రచింపబడిన గ్రంధంలో (పేజీ 18 )లో సవివరముగా వివరించినారు. నేను ఈ విషయాన్ని గరికపాడు (క్రోసూరు మండలా)నికి మారుస్తున్నాను. ఈ గ్రంధ ప్రతులకు చిరునామా (గరికపాటి లక్ష్మీ నరసింహం, ఫ్లాటు నం: 11, బ్లాకు బి-2, మహేశ్వరి టవర్స్, రోడ్ నం 1, బంజారా హిల్స్, హైదరాబాద్ - 500034.)