చర్చ:చందమామ ధారావాహికలు
శివరామ్! ధారావాహికల జాబితా 'టేబుల్' రూపంలో ఉండనవుసరం లేదనుకొంటాను. సాధారణంగా టేబుల్స్ క్రొత్త సభ్యులు దిద్దే ఉత్సాహానికి అడ్డు అని నా అనుభవంలో అనిపించింది. ప్రయోగాత్మకంగా మొదటి జాబితాలో టేబుల్ తీసేశాను. అది ఓకే అయితే మిగిలినవి కూడా మార్చగలరు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 05:47, 16 మార్చి 2008 (UTC)
శివా! రామాయణం, కృష్ణావతారం, మహాభారతం , శివ పురాణం, శివ లీలలు - అనే ధారావాహికలకు లింకులు తొలగించాను. ఇదివరకు చలం "మైదానం" విషయంలో లాగానే ఇవి వేరే వ్యాసాలకు వెళుతున్నాయి గనుక. ఈ విషయంలో క్రింది విధానం మంచిదని నాకు అనిపిస్తుంది. ఇవి సూచనలు మాత్రమే.
- ఈ ధారావాహికల గురించి (అంటే - రామాయణం ఇతిహాసం గురించి కాదు, రామాయణం ధారావాహిక గురించి.) ప్రత్యేకంగా, మీరు గాని మరొకరు గాని, వ్యాసాలు వ్రాసే అవకాశం అంతగా మీకు కనిపించకపోతే అప్పుడు వీటిని అసలు లింకులు లేకుండానే ఉంచవచ్చును.
- అలా కాకుండా ఈ ధారావాహికల గురించి వ్యాసాలు వచ్చే అవకాశం బాగానే ఉన్నదనిపిస్తే ఇలా వ్రాయవచ్చును-
[[రామాయణం (చందమామ ధారావాహిక)|రామాయణం]] --> రామాయణం
లేదా
[[రామాయణం]] ఇతిహాసం గురించిన ధారావాహిక [[రామాయణం (చందమామ ధారావాహిక)]] -->
రామాయణం ఇతిహాసం గురించిన ధారావాహిక రామాయణం (చందమామ ధారావాహిక)
నా సూచనలను పరిశీలించి మీకు సబబు అనిపించినట్లుగా చేయవచ్చును. అదే విధానాన్ని ఇతర ధారావాహికలకు కూడా పాటించవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:09, 12 మే 2008 (UTC)
అరణ్య పురాణం
[మార్చు]అరణ్య పురాణం పౌరాణిక గాథ కాదు. దాని గురించి రాయవలసింది పురాణ ధారావాహికలలో కాదు. సాధారణ ధారావాహికల్లో. త్రివిక్రమ్ 11:43, 15 మే 2009 (UTC)
చిన్న ధారా వాహికలు
[మార్చు]ఈ వ్యాసంలో చిన్న ధారా వాహికలుగా పేర్కొన్న వాటిలో సింద్ బాద్ యాత్రలు అంత చిన్నదేమీ కాదు. మిగిలినవి అరేబియా కథల సీరీస్ లో వచ్చినవి అనుకుంటా. చందమామ ప్రారంభసంచికల్లో కొన్ని నిజంగా చిన్న సీరియల్స్ వచ్చాయి. ఈ విభాగంలోనుంచి వీటిని తొలగించి వాటిని చేర్చాలి. త్రివిక్రమ్ 11:55, 15 మే 2009 (UTC)