చర్చ:చెప్పేవి శ్రీరంగనీతులు, దూరేవి దొమ్మరి గుడిసెలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

దొమ్మరి కులస్తులు పేదరికం - ఆకలి వల్ల వ్యభిచారం చేస్తారు. ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని చోట్లే వారు ఆ వృత్తిలో ఉన్నారు. ఒరిస్సా, మహరాష్ట్రలలో దోంబో మరియు దోంబర్ అని పిలవబడే వీరు అక్కడ వ్యభిచారం చెయ్యరు.


భాషతో సమస్య[మార్చు]

(శ్రీరంగడు అంటే శ్రీ మహా విష్ణువు. శ్రీరంగనీతులు అంటే శ్రీ మహా విష్ణువు పేరుతో చెప్పే నీతులు. దొమ్మరి కులస్తులలో కొంత మంది పేదరికం మరియు ఆకలి వల్ల మనసు చంపుకుని వ్యభిచారం చేస్తారు. కొంత మంది ఒళ్ళు పొగరెక్కిన వాళ్ళు వ్యభిచారిణులతో పడుకుంటారు. శ్రీరంగ నీతులు చెపుతూ దొమ్మరి గుడిసెలలో దూరడం అంటే దేవుని పేరుతో నీతులు చెపుతూ అందుకు విరుధ్ధముగా పాడు పనులు చెయ్యడం అని అర్థం.)

ఇందులో రెండు సమస్యలు కనిపిస్తున్నాయి. రెండూ కూడా తటస్త దృక్కోణం ప్రకారం లేనివి, ఆధారాలు లేని జనరలైజేషన్లు.

  1. పేదరికం, ఆకలి వల్ల మనసు చంపుకొని ---- దీనికి ఆధారం ఏది? అలా జడ్జిమెంటు ఇవ్వటానికి మనమెవరం? దానికి బదులుగా -- ఈ సామెత పుట్టిన రోజుల్లో దొమ్మరి కులపోల్లు వేశ్యా వృత్తిలో ఉండే వాళ్లు -- అని వ్రాస్తే బాగుంటుంది.
  2. ఒళ్ళు పొగరెక్కిన వాళ్ళు -- దీనిక్కూడా ఆధారం లేదు. ఇది కూడా జనరలైజేషన్, విఠులపై కోపం మోతాదుకు మించి ద్వనిస్తున్నాయి. -- కొంత మంది ఒళ్ళు పొగరెక్కిన వాళ్ళు వ్యభిచారిణులతో పడుకుంటారు. -- ఈ పూర్తి వాక్యాన్ని తొలగించినా వ్యాసం సంపూర్ణతకు ఎటువంటి భంగం కలకదు. Chavakiran 09:25, 12 డిసెంబర్ 2008 (UTC)