చర్చ:జోర్డాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జోర్డాన్. దీనిని అరబిక్‌ భాషలో అలోర్దన్ అంటారు. (అల్ ఓర్దన్). పూర్తి పేరు "ముమల్కతు అల్ హాషిమీయత్ అల్ ఓర్దనీయ" (Hashimite Kingdom of Jordan).హాషిమయిట్ వంశస్తులు పాలిస్తున్నరు కనుక ఇది హాషిమైట్ రాజ్యమయింది. ఇది నైఋతి ఆసియా లో సిరియా ఎడారి దక్షిణ భాగము నుంచి అకాబా అఖాతము వరకూ వ్యాపించి ఉన్న ఒక అరబ్ దేశము. సరిహద్దులుగా ఉత్తరాన సిరియా, ఈశాన్యాన ఇరాక్, తూర్పు దక్షిణాల సౌదీ అరేబియా, పడమర ఇజ్రాయేల్, పాలస్తీనా ప్రాంతాలు ఉన్నాయి. మృతసముద్రాన్ని ఇజ్రాయేల్ తో, అకాబా తీర ప్రాంతాన్ని ఇజ్రాయేల్, ఈజిప్టు, సౌదీ దేశాలతో పంచుకుంటోంది. జోర్డాన్ లో చాలా భాగం ఎడారితో నిండి ఉంటుంది. ముఖ్యంగా అరేబియా ఎడారి. కాక పోతే వాయువ్యాన పవిత్రమయిన జోర్డాన్ నది ఉండటంతో ఆ ప్రాంతాన్ని "సారవంతమయిన నెలవంక" గా అభివర్ణిస్తూ ఉంటారు. జోర్డాన్ రాజధాని అమ్మాన్ కూడా ఈ వాయువ్య దిశనే ఉంటుంది. జోర్డాన్ తన చరిత్రలో సుమేరియన్, అక్కాడియన్, బాబిలోనియన్, మెసొపొటేమియన్, అస్సిరియన్, పర్షియన్ వంటి ఎన్నో నాగరికతలను చూసింది. ఇవే కాక కొంతకాలం ఫారోల నాటి ఈజిప్టు సామ్రాజ్యం లో భాగంగా ఉండటమే కాక నెబేటియన్ అనే ఒక స్థానిక నాగరికతకు ఆలవాలమయింది. ఈ నెబేటియన్ నాగరికతకు సంబంధించి ఎన్నో పురావస్తు విశేషాలు పెత్రా లో నేటికీ చూడవచ్చు. ఇవే కాక పాశ్చాత్య నాగరికతలయిన మాసిడోనియా, రోం, బైజాన్‌ట‍యిన్, ఆట్టోమన్ సామ్రాజ్యాల ప్రభావం కూడా జోర్డాన్ పై ప్రభవించింది. బ్రిటీష్ వారి పాలనలో ఉన్న కొద్ది కాలం తప్పితే, ఏడవ శతాబ్ది నుండీ ఇస్లాం మరియు అరబ్ నాగరికతలను స్వంతం చేసుకుంది. జోర్డాన్ లో ఉన్నది రాజ్యాంగబద్దమయిన పార్లమెంటరీ రాచరిక ప్రభుత్వము. ఇక్కడ రాజు దేశాధినేతగా సర్వసైన్యాధ్యక్షునిగా వ్యవహరిస్తారు. రాజు గారు తన ప్రభుత్వము, మంత్రివర్గ సభ్యుల సహకారంతో పరిపాలన సాగిస్తారు. ఈ మంత్రివర్గము ప్రజలు ఎన్నుకున్న లెజిస్లేచరు కు జవాబుదారుగా ఉంటారు. హౌస్ ఆఫ్ డెప్యూటీస్ మరియు హౌస్ ఆఫ్ నోటబుల్స్ అనే రెండు విభాగాలు కలిగి ఉన్న ఈ లెజిస్లేచరు ప్రభుత్వపు లెజిస్లేటివ్ విభాగంగా పని చేస్తుంది. జ్యూడేషియల్ విభాగము మరిక స్వతంత్ర విభాగము. –అశిరా