చర్చ:దక్షిణ మధ్య రైల్వే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రధానమైన స్టేషన్లకు నిర్వచనం ఏమిటి?

--Criticpanther (చర్చ) 09:49, 26 డిసెంబరు 2018 (UTC)

      • Criticpanther గారు, మీరు అడిగారు, నిజానికి నాకు తెలియదు. నాకు తెలిసినది 'ఇదీ ' అని వ్రాస్తున్నాను. మీ ప్రశ్నకు నా జవాబు సరి తూగదు. ప్రధాన స్టేషన్లు అంటే ఒక ఊరిలో ఒకటి కంటే ఎక్కువగా స్టేషన్లు ఉంటే అందులో ప్రధాన మైనది ఒకటి ఉంటుంది. అలాగే రద్దీ, జంక్షన్‌, ప్రముఖ, ఆదాయం, ఇలా అనేక కోణాలలో ముఖ్యమైన రైల్వే స్టేషన్లు అని అర్థం కూడా రావచ్చును. మరి, ప్రధాన స్టేషన్లు గురించి వ్రాసిన వారికి మాత్రమే తెలియాలి. అవి కూడా రైల్వే స్టేషన్లు పుటలకు కాకుండా ఊరి పేర్లకు లింకులు కలిపి ఉన్నాయి, ఇదీ కూడా లింకులు తప్పు కదండి. ఒకవేళ నేనే ఆంగ్లం నుండి తర్జుమా చేస్తూ ఆనాడు వ్రాసి ఉంటే, తెలియక చేసిన దానిని సరిదిద్ది మన్నించమని ఇప్పుడే అడుగుతాను.JVRKPRASAD (చర్చ) 11:41, 26 డిసెంబరు 2018 (UTC)
        • ఈ పుట చరిత్రలో చూసి మీకు పొందు పరచు చున్నాను. C.Chandra Kanth Rao గారికి ఏమైనా తెలిసి ఉండవచ్చునేమోనండి లేదా నాది పొరపాటు కావచ్చు.
(ప్రస్తు | గత) 21:12, 26 అక్టోబరు 2008‎ C.Chandra Kanth Rao (చర్చ | రచనలు)‎ . . (6,290 బైట్లు) +240‎ . . (→‎దక్షిణ మధ్య రైల్వే జోన్‌లోని ప్రధాన రైల్వే స్టేషన్లు) (దిద్దుబాటు రద్దుచెయ్యి | ధన్యవాదాలు)
(ప్రస్తు | గత) 21:09, 26 అక్టోబరు 2008‎ C.Chandra Kanth Rao (చర్చ | రచనలు)‎ . . (6,050 బైట్లు) +589‎ . . (→‎దక్షిణ మధ్య రైల్వే జోన్‌లోని ప్రధాన రైల్వే స్టేషన్లు) (దిద్దుబాటు రద్దుచెయ్యి | ధన్యవాదాలు)

JVRKPRASAD (చర్చ) 11:54, 26 డిసెంబరు 2018 (UTC)

JVRKPRASAD గారు: మీ త్వరిత సమాధానానికి కృతజ్ఞతలు. నిజానికి 'ప్రధానమైన' అనేది అందరికి అర్ధమయ్యే పదం. దీనికి కొత్తగా నిర్వచనం అడగడం ఒకవిధంగా విడ్డూరం. ఈ జాబితాలో కొన్ని గ్రేడ్-ఎ స్టేషన్లు లేవు. నేను చేర్చుదామని ప్రయత్నిస్తే పేజీ లాక్ చేసి వుంది. అందువల్ల ఆ ప్రశ్న అడిగాను. ధన్యవాదాలు.

--Criticpanther (చర్చ) 10:51, 29 డిసెంబరు 2018 (UTC)

Criticpanther గారు, మీరు ఏదో ఒక పేరుతో ఇక్కడ సభ్యుడుగా చేరి, తగిన విధంగా మార్పులు తప్పకుండా చేయవచ్చును. నేను కూడా తప్పకుండా సహకరిస్తాను. ప్రధాన స్టేషన్లు అనే పదానికి బదులు గ్రేడుల వారీగా జాబితా ఇవ్వవచ్చును. నన్ను మార్చమని ఎవరు చెప్పినా కొంత వరకు మార్చగలను. మీకు ధన్యవాదములు.JVRKPRASAD (చర్చ) 11:04, 29 డిసెంబరు 2018 (UTC)