చర్చ:నీరు
మినరల్ నీళ్లలో మోసం
[మార్చు]పలు కంపెనీలు 'మినరల్' వాటర్ పేరుతో జనాన్ని నిలువునా మోసం చేస్తున్నాయి. కాసుల కోసం కక్కుర్తి పడి కనీస ప్రమాణాలు కూడా పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. మినరల్ వాటర్‌పై ప్రజలు చూపుతున్న ఆపేక్షను ఆసరాగాచేసుకొని అందమైన డబ్బాల్లో నాణ్యత లేని నీటిని అందజేస్తూ మోసం చేస్తున్నారు.ఐఎస్ఐ ఆమోదం పొందిన ప్లాంట్ల క్యాన్లను హైజాక్ చేసి వాటిని మామూలు నీటితో నింపి విక్రయిస్తున్నారు. హెర్బల్ వాటర్ ప్లాంట్స్ పై ప్రభుత్వ అజమాయిషీ ఏమాత్రం ఉండదు. ఐఎస్ఐ ఆమోదం ఉన్నవారు ప్రతి సంవత్సరం ఫీజులు పేరుతో చెల్లించాల్సిన సుమారు లక్ష రూపాయలను హెర్బల్ ప్లాంట్ నిర్వాహకులు చెల్లించాల్సిన అవసరం లేదు.వీరికి ఎటువంటి లైసెన్స్‌లతో పనిలేదు. ఈ ప్లాంట్ల నిర్వాహకులు ఒక సంఘంగా ఏర్పడి రిజ్రిస్టేషన్ చేయించుకుంటారు. హెర్బల్ పౌడర్ కలిపిన మినరల్ వాటర్‌ను వీరు మార్కెట్‌లో విక్రయిస్తారు.వారికి వారే నిబంధనలు రూపొందించుకొని ఒక ప్రాంత ప్లాంట్ యజమాని మరొక ప్రాంత ప్లాంట్‌కు వెళ్లి అవి అమలు జరుగుతున్నాయో లేదో తనిఖీలు చేస్తారు. యజమానులు వారే, తనిఖీలు చేసేది వారే.ఇటువంటి ప్లాంట్లలో నాణ్యతను పరిశీలించేందుకు ప్రతి ప్లాంట్‌లోనూ మైక్రోబయాలజీ, కెమ్రిస్టీ ల్యాబ్‌లు ఉండాలి.హెర్బల్ పౌడర్ కలిపిన నీటిని ప్రజలు అంతగా ఇష్టపడే పరిస్థితి లేకపోవడంతో ఈ పేరుతో మామూలు మినరల్ వాటర్‌నే సరఫరా చేస్తున్నారు.నాందీ ఫౌండేషన్ నీటిని గ్రామీణ ప్రాంతాల నుంచి సేకరించి ఈ నీటిని క్యాన్లలో నింపి పట్టణ ప్రాంతాలకు తరలించి ఒక్కో క్యాన్‌కు 20 నుంచి 30 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నాందీ వాటర్‌ప్లాంట్ల వద్ద 20 లీటర్ల వాటర్ రూపాయికి లభిస్తుండగా 40 లీటర్ల వాటర్ 1.50 రూపాయలకు పంపిణీ చేస్తున్నారు.(ఆంధ్రజ్యోతి 12.3.2010)