చర్చ:పింగళి సూరనామాత్యుడు
స్వరూపం
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
ప్రపంచంలో మొట్టమొదటి "చైతన్యస్రవంతి" కావ్యం?
[మార్చు]ప్రపంచసాహిత్యంలో చైతన్యస్రవంతి (Stream of consciousness) పద్ధతిలో రాయబడ్డ మొట్టమొదటి రచన పింగళిసూరన కళాపూర్ణోదయమని http://society.indianetzone.com/literature/1/regional_literature.htm లో Telugu Literature కింద రెండో పేరాలో ఉంది. ఇది నిజమేనా?
-త్రివిక్రమ్ 04:27, 9 జూన్ 2007 (UTC)
తొలి తెలుగు కావ్యం
[మార్చు]"కళాపూర్ణోదయాన్ని తెలుగు సాహిత్యం లో మొట్టమొదటి కావ్యంగా పరిగణిస్తారు" అని ఈ వ్యాసంలో ఉంది. కానీ నాకు తెలిసినంతవరకు సంస్కృత కావ్యాలకు అనువాదం కాకుండా తెలుగులో వెలువడిన మొట్టమొదటి స్వతంత్రకావ్యం అల్లసాని పెద్దన రాసిన మనుచరిత్ర. అందుకే పెద్దనను ఆంధ్రకవితాపితామహ అంటారు.
-త్రివిక్రమ్ 07:01, 9 జూన్ 2007 (UTC)
- ఆరుద్ర ఈ విశేషాల గురించి ఏమీ ప్రస్తావించలేదు. నిజమైతే తప్పకుండా ప్రస్తావించేవాడేమో. చైత్యన్య స్రవంతి కావ్యమంటే ఏంటో నాకు తెలియదు కానీ. కధా వస్తువును ఇతిహాసాలనుండి, పురణాలనుండి తీసుకొనక స్వయంగా ఒక కధ కల్పించి సజీవ పాత్రలను సృష్టించి స్వతంత్ర రచన చేసింది తెలుగు కవులలో ప్రపధమంగా పింగళి సూరన కళాపూర్ణోదయమేనని చెప్పాడు. ఇందులో కధ కవి స్వయంగా చెప్పకుండా పాత్రల ద్వారా పూర్వకధలను చెప్పిస్తాడని. "కొంత నవలలాగా,కొంత నాటకంలా కొంత సినిమాలాగా సాగుతుందని ఆరుద్ర అభిప్రాయపడ్డాడు. జీవితంలాగే కళాపూర్ణోదయం వెంటనే అర్ధం కాదు. అర్ధం స్పురించినా అంతరార్ధం అవగాహన చేసుకోవటానికి చాలా వ్యవధి పడుతుంది. అయితే ఉత్త కధమాత్రమే కావలసిన వాళ్లకు సైతం ఈ కావ్యం కమ్మని విందు చేస్తుంది అన్నాడు ఆరుద్ర --వైజాసత్య 21:00, 11 జూన్ 2007 (UTC)