చర్చ:పెండ్యాల వరవరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)



జయ ప్రకాశ్, ఈ వ్యాసము మీద మీరు చేసిన కృషి చాల అభినందనీయము. తెలుగు వికిపీడియాకు స్వాగతము. --వైఙాసత్య 02:39, 15 నవంబర్ 2005 (UTC)

సత్య గారు, ఈ వ్యాసం నా మొదటిది! Wiki వాడడం మెల్లిగా నేర్చుకుంటున్నాను. మీరు నా వ్యాసానికి చేసిన మార్పులకు ధన్యవాదాలు. ప్రస్తుతానికి వ్యాసాన్ని త్వరగా పూర్తి చేయడం గురించి కృషి చేస్తున్నాను (fast & efficient approach to finish an article). -జయ ప్రకాశ్

తటస్థంగా వ్రాయడం[మార్చు]

ఈ వ్యాసంలో కొద్దిగా మన వికీపీడియా తటస్థత దెబ్బతింటున్న వాక్యాలు ఉన్నట్లు అనిపిస్తుంది। నిజానికి తటస్థంగా వ్రాయడం చాలా కష్టమైన విషయము అని నేను ఒప్పుకుంటున్నాను కానీ మనము తటస్థముగా వ్రాయడము వికీపీడియా విజయానికి చాలా అవసరము, ఇది వికి యొక్క మూల స్థంబాలలో కూడా ఒక విషయము। ఉదాహరణము : "రెండు దశాబ్దాల నుండి రాష్ట్ర ప్రభుత్వం ఆయన మీద ఎన్నో కేసులు బనాయించి పేడిస్తూనే ఉంది. "

అని వ్రాసే బదులు "రెండు దశాబ్దాల నుండి వీరిపై ఎన్నో కేసులు పెట్టడం జరిగినది, విమర్శకులు వీటిని కేవలం కక్షసాధింపు చర్యలుగా భావిస్తుంటారు" వంటి వాక్యాలు ఎలా ఉంటాయి॥ ఇది కూడా తటస్థంగా లేకపోవచ్చు కానీ

నా పాయింటు ఏమిటంటే మీరు ఒకసారి ఈ తటస్తత గురించి ఆలోచించగరలు అని॥

last but not least : Great effort, congrats and best wishes. Chavakiran 04:21, 16 డిసెంబర్ 2005 (UTC)


మీ అభిప్రాయము చెప్పినందుకు షుక్రియా! నాకు ఇంకా పది వ్యాసాల అనుభవం కుడా లేదు, తటస్థంగా రాయనీకి నా శాయశక్తులా ప్రయత్నిస్తా.వికీలో ఏదో ఒక్కరికే రాయడానికి అవకాశం ఉంది అన్నట్లు కాదు కదా? అదే 'వికీ'లోని అందం అనుకుంటా.వ్యాసలను తటస్థపరిచేందుకు ఏవైనా మార్పులు ఉంటే సంకోచించకుండా చేయగలరు. ఇలాంటి వాక్‌స్వాతంత్ర్యం ఇచ్చిన మొదటి సైట్ 'వికీ 'యేనేమో దానికీ, ఇక్కడ వ్యాసాలకు తోడ్పడుతున్న 'వికీపీడియన్' లందరికీ మరోసారి, షుక్రియా! - - జయ ప్రకాశ్ 17:35, 16 డిసెంబర్ 2005 (UTC)

తటస్థంగా రాయాలి -వేదపండిత