చర్చ:పెట్లూరు (వెంకటగిరి మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పెట్లూరు , శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వెంకటగిరి మండలానికి చెందిన గ్రామము.[1].

డా.గోవిందరాజులు, ఈ గ్రామంలోని నిమ్మ పరిశోధనాసంస్థలో శాస్త్రవేత్తగా పనిచేయుచున్నారు. వీరికి హైదరాబాదులో జరిగే ప్రపంచవ్యవసాయ సదస్సులో పాల్గొనడానికి ఆహ్వానం అందినది. నాలుగు రోజులపాటు జరిగే ఈ సదస్సులో, పెట్లూరు నిమ్మ పరిశోధనా సంస్థలొ తయారు చేసే నిమ్మ, బతాయి తదితర ఉద్యాన పంటలను ప్రదర్శిస్తారు. [1]

ఈ గ్రామానికి చెందిన తుపాకుల మహేంద్ర అను విద్యార్థిచిన్నతనంలోనే చూపుకోల్పోవడంతో, వెంకటగిరి పట్టణంలోని సెయింట్ ఫ్రాన్సిస్ అంధుల పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్నాడు. ఇతడు 2014, మే నెలలో వెలువడిన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో 9.7/10 మార్కులు సాధించి, రాష్ట్రస్థాయిలోనే ప్రధముడుగా నిలిచినాడు. ఇతని తల్లిదండ్రులు:- తుపాకుల రాఘవేంద్ర, మంగమ్మ [2]